కోయిలకాంత్

ఈ చేప దాదాపు 40 కోట్ల సంవత్సరాల క్రితం నుండి ఉంది. సైంటిస్టులు గతంలో అంతరించిపోయిందని అనుకున్నారు. కానీ ఇది 1938లో సముద్రంలో మళ్లీ కనిపించింది.

హార్స్‌షూ క్రాబ్

ఈ పీత 45 కోట్ల సంవత్సరాల పురాతనది. దీని రక్తం నీలం రంగులో ఉంటుంది. మెడికల్ రీసర్చిల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

నాటిలస్

ఈ సముద్ర జీవి 50 కోట్ల సంవత్సరాల క్రితం నాటి జీవ శిలాజంగా పరిగణించబడుతుంది. షెల్ లో నివసిస్తుంది, అత్యంత పురాతన జంతువుల్లో ఒకటి.

కాక్రోచ్

ఇది 35 కోట్ల సంవత్సరాలుగా జీవిస్తుంది. డైనోసార్లు అంతరించి పోయాక కూడా బతికిపోయింది. ఏ పరిస్థితినైనా తట్టుకొని జీవించగల సామర్థ్యం దీనికి ఉంది.

లాటిమిరియా చేప

ఇది కూడా కోయిలకాంత్ చేప వంటిదే. 40 కోట్ల సంవత్సరాలుగా సముద్రంలో ఉంది. జీవశాస్త్రానికి నూతన రహస్యాలను అందించింది.

పర్పుల్ ఫ్రాగ్ 

పర్పుల్ కలర్ లో ఉండే ఈ కప్పలు 19 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే డైనోసార్ల కాలం నుండీ బతికే ఉన్నాయి. అత్యంత అరుదైన జాతి ఇది. 

గింగ్‌కో చెట్టు జంతువు

ఇది మొక్కల ప్రపంచానికి చెందిన జీవశిలాజం. 27 కోట్ల సంవత్సరాల నుండి ఉంది. చైనాలో ఇది పవిత్రంగా పరిగణించబడుతుంది.