క్వెట్జల్ పక్షి

మెక్సికోలో కనిపించే ఈ పచ్చని రెక్కల పక్షి, పొడవైన తోకతో ఏంజెల్ లా కనిపిస్తుంది. దాని మెరిసే రంగులు అసలు ఈ లోకానివేనా అన్నట్టు అనిపిస్తాయి.  

క్వెట్జల్ పక్షి

దక్షిణ అమెరికాలో కనిపించే ఈ పక్షికి పురాతన జీవులలాగా ఎగరలేని శరీరం ఉంటుంది. దాని మూత్రం నుండీ వచ్చే వాసన వలన దీనిని "స్మెలీ బర్డ్" అంటారు.

షూబిల్ స్టోర్క్  

పెద్ద తల, బలమైన ముక్కుతో ఆఫ్రికాలో కనిపించే ఈ పక్షి డైనోసార్‌లను గుర్తుకు తేలుస్తుంది. దాని కళ్ళు కూడా భయంకరంగా ఉంటాయి.

పొటూ పక్షి  

దీనిని చూసినవాళ్లెవ్వరూ మర్చిపోలేరు. ఎందుకంటే,ఇది చెట్టు కొమ్మలా మారిపోతుంది. రాత్రివేళల్లో దీని కళ్ళు మెరుస్తూ భూతంలా కనిపిస్తుంది.  

అండియన్ కాక్-ఆఫ్-ది-రాక్  

ఈ పక్షి ఆరెంజ్ కలర్ లో మెరుస్తూ ఉంటుంది. దాని తలపై ఉండే పెద్ద క్రీస్ట్ వల్ల ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది సౌత్ అమెరికా అడవుల్లో జీవిస్తుంది.

సాటిన్ బౌబర్డ్  

ఈ ఆస్ట్రేలియన్ పక్షి నీలం రంగులో మెరిసే వస్తువులను సేకరిస్తూ వాటిని తన గూటిలో అలంకరిస్తుంది. ఫిమేల్ బర్డ్ ని ఎట్రాక్ట్ చేయటానికి ఇదలా చేస్తుంది. 

ఫ్రిగేట్ బర్డ్

ఇది సముద్రతీరాల్లో కనిపించే పెద్ద రెక్కల పక్షి. మగ పక్షి గొంతు దగ్గర ఉండే రెడ్ బెలూన్‌లాంటి భాగాన్ని  జంట ఆకర్షణ కోసం ఉపయోగిస్తుంది.

మండరిన్ డక్  

ఇది ప్రపంచంలో అత్యంత అందమైన బాతులలో ఒకటి. దీని రంగుల కలయిక, ఆకృతి చూస్తే అది ఆర్టిస్ట్ గీసిన బొమ్మలా అనిపిస్తుంది.  

గ్రేట్ బర్డ్ ఆఫ్ ప్యారడైస్  

పపువా న్యూగినియాలో కనిపించే  ఈ పక్షి, దీని రంగులు, వలయాకార రెక్కలు చూసి ఎవరికైనా ఇది  అసలు ఈ లోకానికి చెందినదేనా  అనిపించక మానదు.

అక్సిస్ బర్డ్ ఆఫ్ ప్యారడైస్  

చిన్నదైనా ఈ పక్షి ఒక కళాఖండంలా ఉంటుంది. బ్లూ కలర్ మెరిసే రెక్కలతో నాట్యం చేస్తూ  విపరీతంగా ఆకర్షిస్తుంది.