తవాంగ్  

అరుణాచల్ ప్రదేశ్ లోని హిమాలయ పర్వతాల మధ్య ఉన్న తవాంగ్  ఓ అందమైన పట్టణం. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు, బౌద్ధ ఆరామాలు, పల్లె జీవనశైలి ఐసోలేషన్ కోరేవారికి బెస్ట్ డెస్టినేషన్.

కోక్సర్ విలేజ్  

హిమాచల్ ప్రదేశ్ లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో దాగి ఉన్న గోక్సన్, సహజ సౌందర్యం, ట్రెకింగ్ మరియు నిశ్శబ్ద వాతావరణంతో ఉన్న అద్భుతమైన ఐసోలేటెడ్ లొకేషన్.

అండమాన్, నికోబార్ దీవులు  

నికోబార్‌లోని అండమాన్ సముద్రతీరాలు, ఆకాశం-నీటి కలయికతో శాంతంగా ఉండే  ప్రదేశం. ఇది ప్రకృతి ప్రేమికులకు  ఓ వరం. 

లాంగ్‌వాలా 

రాజస్థాన్ లోని లాంగ్‌వాలా ఇండో-పాక్ యుద్ధ చరిత్ర కలిగిన ఐసోలేటెడ్ డెజర్ట్ ఏరియా. ఇది శాంతంగా ఉండే ఇసుక తిన్నెల మధ్య స్మృతుల సందర్శన.

మాలణా 

హిమాచల్ ప్రదేశ్ లోని ప్రాచీన గ్రామంగా ప్రసిద్ధి చెందిన మాలణా, ఇతర గ్రామాల కంటే పూర్తిగా వేరుగా ఉంటుంది. సంస్కృతి, నిబంధనల కారణంగా ఇది ఐసోలేటెడ్ గమ్యం.

జులుక్ 

సిక్కింలోని పర్వతాల మధ్య ఉన్న జులుక్ గ్రామం, తక్కువ జనాభా, కురిసే మంచు, రహదారి వలయాలు కలిగిన ప్రశాంతమైన ప్రాంతం.

చోప్తా

ఉత్తరాఖండ్ లోని చోప్తా టంగ్‌నాథ్ ట్రెక్ పాయింట్ దగ్గరలో ఉండి, హిమాలయాల నడుమ కాసేపు తలవంచుకునే స్వర్గధామంలా ఉంటుంది.

బిన్నగుడే  

కర్ణాటకలోని ఫారెస్ట్ రిసర్వ్ ప్రాంతంలో ఉన్న బిన్నగుడే, పక్షుల కిలకిలలు, ప్రకృతి కిరణాలు కలిసే ప్రశాంతత కోరుకొనే వారికి పర్ఫెక్ట్ డెస్టినేషన్.

ఆగుమ్బె  

కర్ణాటకలోని ఈ ప్రాంతం  వర్ష భూములుగా ప్రసిద్ధి. తక్కువ  రవాణా, పచ్చని అడవులు, మిస్టిక్  వాతావరణం కలిగిన స్థలం.

హన్లే  

హన్లే లడాఖ్‌లోని అత్యంత  నిశ్శబ్దమైన ప్రాంతం, బంజరు పర్వతాలు మరియు పూర్తి  నిశ్శబ్దంతో చుట్టుముట్టబడిన ఒక మారుమూల అబ్జర్వేటరీ.