యాంగ్లర్ ఫిష్
ఈ చేప తన తలపై కాంతిని ఉత్పత్తి చేసే అవయవాన్ని కలిగి ఉంటుంది. పెద్ద తల, పెద్ద నోరు, పదునైన దంతాలు కలిగి చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది.
గల్పర్ ఈల్
ఈ ఈల్ చూడటానికి సన్నగా ఉన్నా, ఒక్కసారిగా దాని మొహం పెద్దదిగా తెరుచుకొని బలమైన ఆహారాన్ని మింగేస్తుంది. దీని ఆకారమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
టార్డిగ్రేడ్
వీటిని వాటర్ బేర్స్ అని కూడా పిలుస్తారు. చిన్నవే అయినా, విపరీతమైన రేడియేషన్ పరిస్థితుల్లో కూడా తట్టుకొని బ్రతికేస్తాయి.
గోస్ట్ షార్క్
సామాన్యంగా ఇది కనిపించదు. పారదర్శక తల, భయంకరమైన కళ్ళు, వింత రూపం కలిగి ఉంటుంది. సముద్రపు లోతుల్లో, చీకటి నీటిలో, నిశ్శబ్దంగా తేలుతూ ఉంటుంది.
హాట్చెట్ ఫిష్
ఇది తెల్లటి కాంతిని వెలువరిస్తూ, శత్రువులనుండీ తప్పించుకుంటుంది. దీని శరీరం అల్యూమినియం ముక్కలా మెరిసిపోతుంది.
అటోల్లా జెల్లీ ఫిష్
చీకటి నీటిలో నీలం రంగు కాంతి వదులుతూ కదులుతుంది. ఇది దానిపై దాడి చేసిన శత్రువులను దారి మళ్లించేందుకు ఈ ప్రత్యేక వెలుగు ఉపయోగిస్తుంది.
బారెల్ ఐ ఫిష్
ఇది తల లోపల భాగాలన్నీ కనపడేలా పారదర్శక తలతో ఉంటుంది.దీని కళ్ళు పైకి
చూస్తూ,పై నుండి పడే
కాంతిని పసిగడతాయి.