ఆక్సోలోట్ల్

మెక్సికోకి చెందిన ఈ బుల్లి సాలమండర్ పింక్ కలర్ లో ఉంటుంది. స్మైలింగ్ ఫేస్, సాఫ్ట్ స్కిన్ కలిగి ఇది చూడటానికి ముద్దుగా ఉంటుంది. 

పింక్ డాల్ఫిన్

అమెజాన్ నదిలో కనిపించే ఈ డాల్ఫిన్, ప్రత్యేకమైన పింక్ కలర్ లో ఎట్రాక్టివ్ గా ఉంటుంది. నీటి లోతుల్లో మెల్లగా ఈదుతూ కనిపిస్తుంది. 

పింక్ ఫ్లేమింగో 

ఈ పక్షి పొడవాటి కాళ్లు, పింక్ కలర్ బాడీతో ప్రసిద్ధి. నీటిలో నిలబడి చేపలు వేటాడుతుంది. పసందైన అందంతో కనిపిస్తుంది.

రోజ్ హెయర్ టారాంటులా 

ఈ స్పైడర్ రోజ్ హెయిర్ కలిగి ఉంటుంది. దీనిని కొందరు పెంపుడు జంతువుగా కూడా పెంచుతారు.

పింక్ సీ హార్స్ 

ఈ చిన్న సముద్ర జీవి, సముద్ర జలాల్లో గులాబీ రంగుతో తేలుతూ కాంతివంతంగా కనిపిస్తుంది. ఇది చాలా అరుదైనదిగా పరిగణించ బడుతుంది.

పింక్ క్యాటర్ పిల్లర్ 

ఈ క్యాటర్ పిల్లర్ చూడటానికి చిన్నదే అయినా మెరిసే గులాబీ శరీరంతో చాలా అందంగా కనిపిస్తుంది. ఆకులమీద నెమ్మదిగా కదలడమే దీని ప్రత్యేకత.

పింక్ మాంటిస్  

ఈ వాకింగ్ ఫ్లవర్ మాంటిస్  పింక్ కలర్ లో ఉండే పువ్వులా కనిపిస్తుంది. ఇది ఆకల మద్య దాక్కొని తిరుగుతూ పూల మకరందం కోసం వచ్చిన  కీటకాలని వేటాడుతుంది. 

పింక్ డ్రాగన్ మిల్లీపెడ్  

ఈ అరుదైన పురుగు ఎరుపు-గులాబీ రంగులతో నడిచే నాడీలా ఉంటుంది. థాయిలాండ్ అడవుల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది.

పింక్ పాంథర్ మత్  

ఈ పురుగు గులాబీ, నలుపు కలయికలో అద్భుతంగా ఉంటుంది. దీని రెక్కలపై ఉండే ఆకృతి కళాత్మకం.

పింక్ స్నైల్  

ఇవి రేర్ గా కనిపించే రామ్‌షార్న్ నత్తలు. మెరిసే పింక్ కలర్ షెల్ తో, ట్రాన్స్పరెంట్ కళ్ళతో చాలా అందంగా ఉంటాయి.