జిరాఫీ ప్రపంచంలో అత్యంత ఎత్తైన భూ జంతువు. మగ జిరాఫీ సాధారణంగా 16 నుండి 18 అడుగుల ఎత్తు, ఆడ జిరాఫీలు కొంచెం తక్కువ ఎత్తులో ఉంటాయి.
పొడవైన మెడ
జిరాఫీ మెడ చాలా పొడవుగా ఉంటుంది కానీ అందులో కేవలం 7 ఎముకలు మాత్రమే ఉంటాయి. కానీ ప్రతి ఎముక సుమారు 10 ఇంచుల పొడవుగా ఉంటుంది. ఈ పొడవైన మెడతో అవి ఎత్తైన చెట్ల ఆకులను తింటాయి.
పవర్ హౌస్
జిరాఫీ గుండె 11 కిలోల బరువు ఉండి, నిమిషానికి 150 లీటర్ల రక్తాన్ని పంపుతుంది. ఎందుకంటే తల చాలా ఎత్తులో ఉండటంతో రక్తాన్ని మెదడుకి పంపడానికి చాలా బలమైన పీడనం అవసరం అవుతుంది.
నాలుక పొడవు
జిరాఫీ నాలుక సుమారు 45 నుండి 50 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. ఈ నాలుకతో అవి ముళ్లున్న ఆకులను కూడా సులభంగా తీసుకుంటాయి.
ఆహారం
జిరాఫీలు ఎక్కువగా అకేసియా చెట్ల ఆకులు తింటాయి. వాటి ఆహారంలో ఆకులు, పూలు, పండ్లు, కొన్నిసార్లు గడ్డి కూడా ఉంటాయి. ఒక పెద్ద జిరాఫీ రోజుకు 30 కిలోల వరకు ఆకులు తింటుంది.
నిద్ర
జిరాఫీలు రోజులో కేవలం 30 నిమిషాల నుండి 2 గంటల వరకు మాత్రమే నిద్రిస్తాయి. అవి ఎక్కువసార్లు నిలబడి లేదా కూర్చుని తక్కువ సమయమే నిద్రిస్తాయి,
రక్షణ
జిరాఫీ కాళ్లతో చేసే ఒక్క కిక్ చాలా శక్తివంతంగా ఉంటుంది. అది సింహం లేదా చిరుత పులి వంటి పెద్ద మృగాలను కూడా చంపగలదు.
బలమైన పిల్లలు
జిరాఫీ పిల్లలు పుట్టిన ఒక గంటలోపే నిలబడి నడవడం ప్రారంభిస్తాయి. పుట్టిన వెంటనే అవి సుమారు 6 అడుగుల ఎత్తుగా ఉంటాయి. ఇది వాటి జీవన రక్షణకు చాలా ముఖ్యం,
స్కిన్ డిజైన్
ప్రతి జిరాఫీకి చర్మంపై ఉన్న ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. రెండు జిరాఫీలకు ఒకే ప్యాటర్న్ ఉండదు. ఈ చర్మపు డిజైన్ వల్ల అవి అడవిలో కలిసిపోవడానికి, దాగడానికి సహాయపడుతుంది.
అంతరిస్తున్న జంతువు
ప్రపంచవ్యాప్తంగా జిరాఫీల సంఖ్య 30% కంటే ఎక్కువ తగ్గిపోయింది. ఇప్పుడివి “వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్” జాబితాలో చేరాయి. కాబట్టి వాటిని కాపాడటం మనందరి బాధ్యత.