ఇప్పటి AI యుగంలో Prompts రాయడం ఒక పెద్ద ట్రెండ్ అయింది కానీ నిజమైన Skills మాత్రం ఎప్పటికీ విలువ కోల్పోవు.

Prompt ఇవ్వడం ద్వారా output త్వరగా వస్తుంది కానీ Skill ఉంటే సమస్యను లోతుగా అర్థం చేసుకుని మంచి పరిష్కారం సృష్టించగలం.

ప్రాంప్ట్స్ తాత్కాలిక సహాయం మాత్రమే చేస్తాయి కానీ స్కిల్స్ మాత్రం జీవితాంతం మనకు గుర్తింపుని నమ్మకాన్ని ఇస్తాయి 

AI కి మంచి ప్రాంప్ట్ ఇవ్వాలంటే కూడా ఆ రంగంపై కనీస నైపుణ్యం ఇంకా సరైన అవగాహన తప్పనిసరిగా అవసరం ఉంటుంది. 

స్కిల్ లేకుండా ప్రాంప్ట్స్ వాడితే రిజల్ట్ కనిపిస్తుంది కానీ డీప్ క్వాలిటీ అలాగే కంప్లీట్ కంట్రోల్ తగ్గిపోతుంది.

ప్రాంప్ట్స్ స్పీడ్ ని ఇస్తాయి స్కిల్స్ ప్రాపర్ రూట్ డైరెక్షన్ ఇస్తాయి ఈ రెండూ కలిస్తేనే కెరీర్లో  రియల్ సక్సెస్ సాధ్యమవుతుంది.

ఒక మంచి డిజైనర్ కి ప్రాంప్ట్ హెల్ప్ చేస్తుంది కానీ అసలు క్రియేటివిటీ మరియు ప్రత్యేకత ఎప్పుడూ స్కిల్ నుంచే వస్తాయి.

కోడింగ్ లో ప్రాంప్ట్ తో కోడ్ ఈజీగా వస్తుంది కానీ డిబగ్ చేయడానికి లోతైన స్కిల్ మరియు ఎక్స్ పీరియన్స్ చాలా అవసరం ఉంటుంది.

ఫ్యూచర్ లో ప్రాంప్ట్స్ మారవచ్చు కానీ నేర్చుకున్న స్కిల్స్ అంత ఈజీగా మారిపోవు. చాలా కాలం పాటు మనతోనే ఉంటాయి.

కాబట్టి ప్రాంప్ట్స్ నేర్చుకోండి కానీ స్కిల్స్ ను ఎప్పటికీ వదలకండి అదే మీ రియల్ స్ట్రెంత్  మరియు ఫ్యూచర్ సక్సెస్ కి ఫౌండేషన్.