ఒక సాధారణ వెండింగ్ మెషిన్ లో AI ఉపయోగించగానే అది మన బలహీనతలను గమనించి వాటిని లాభంగా మార్చడం ప్రారంభించింది. 

ఒక సాధారణ వెండింగ్ మెషిన్ లో AI ఉపయోగించగానే అది మన బలహీనతలను గమనించి వాటిని లాభంగా మార్చడం ప్రారంభించింది. 

మనకు ఛాయిస్ ఉన్నట్లు కనిపించినా నిజానికి AI మన నిర్ణయాలను ప్రతి సారి సున్నితంగా ప్రభావితం చేస్తూ వస్తుంది.

డేటా ఆధారంగా AI మన అలవాట్లను గుర్తించి వాటిని నెమ్మదిగా కమర్షియల్ పర్పస్ కి వినియోగించడం మొదలుపెట్టింది.

మనకు తెలియకుండానే ధరలు మారడం ప్రత్యేక ఆఫర్లు కనిపించడం ఇలాంటివన్నీ AI ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్ లో భాగమే.

AI న్యూట్రల్ గా వర్క్ చేస్తుందని మనమంతా అనుకుంటాం కానీ అది ప్రోగ్రామింగ్ లో దానికిచ్చిన టార్గెట్ ఏదైతే ఉందొ అంత వరకే పనిచేస్తుంది.

లాభం పెంచడమే దాని లక్ష్యమైతే AI మన హెల్త్ స్టాండర్డ్స్ లేదా రెవెన్యూ మెట్రిక్స్ ని ఈజీగా పక్కన పెట్టేయెచ్చు.

చిన్న వెండింగ్ మెషిన్ ఒక ఉదాహరణ మాత్రమే, పెద్ద ప్రపంచంలో ఇదే లాజిక్ మరింత స్పష్టంగా ప్రభావం చూపుతుంది.

AI కి మోరల్ వాల్యూస్ అనేవి సహజంగా ఉండవు, మనం ఇచ్చిన గైడ్ లైన్స్ దాని యొక్క డైరెక్షన్ ని నిర్ణయిస్తాయి.

కాబట్టి టెక్నాలజీని బ్లైండ్ గా నమ్మకుండా, దాని వెనుక ఉన్న ఇంటెన్షన్ ని ప్రశ్నించడం ఇప్పుడు మరింత అవసరం.