AI వాయిస్ పూర్తిగా రోబోటిక్ గా వినిపిస్తే వ్యూయర్స్ కనెక్ట్ అవ్వరు, వాచ్ టైమ్ తగ్గుతుంది, మోనిటైజేషన్ అప్రూవల్ కష్టమవుతుంది.

వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో కాపీరైట్ మ్యూజిక్ వాడితే కంటెంట్ ఐడి స్ట్రైక్ పడుతుంది.  ఇన్కమ్ బ్లాక్ అవుతుంది, ఛానల్ రిస్క్ పెరుగుతుంది.

ఇతర వీడియోల స్క్రిప్ట్‌ను స్మాల్ చేంజెస్ చేసి రీ యూజ్ చేస్తే యూట్యూబ్ రీయూజ్డ్ కంటెంట్‌గా గుర్తించి మోనిటైజేషన్ నిలిపివేస్తుంది.

తెలుగు పదాలు తప్పుగా ఉచ్చరించే AI వాయిస్ వాడితే వ్యూయర్స్ ఇన్ టాలరెన్స్ గా ఫీలవుతారు.. రిటెన్షన్ గణనీయంగా తగ్గిపోతుంది.

ఎమోషన్ లేకుండా ఫ్లాట్ టోన్ లో మాట్లాడే వాయిస్ వాడితే వీడియో బోరింగ్ అనిపిస్తుంది, ఎంగేజ్‌మెంట్ తగ్గుతుంది.

హెల్త్ లేదా ఫైనాన్స్ అడ్వైజెస్ ఫ్యాక్ట్ చెక్ లేకుండా చెబితే మిస్ఇన్ఫర్మేషన్ స్ట్రైక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఆడియోలో నాయిస్ లేదా ఎకో ఉంటే ప్రొఫెషనల్ ఫీల్ తగ్గుతుంది, వెంటనే మీ ఛానెల్ బ్రాండ్ నమ్మకం దెబ్బతింటుంది.

ఒకే AI వాయిస్‌ను వివిధ రకాల ఛానల్స్‌లో ఒకేలా వాడితే స్పామ్‌గా అనుమానం పెరిగి మీ ఛానెల్ డీమోనిటైజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 

ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ వాయిస్‌లో గ్రమటికల్ మిస్టేక్స్ ఉంటే గ్లోబల్ వ్యూయర్స్  కన్ఫ్యూజ్ అవుతారు, వాచ్ టైమ్ పడిపోతుంది. 

పూర్తిగా AI మీద ఆధారపడితే హ్యూమన్ టచ్ కనిపించదు, దీంతో క్రెడిబులిటీ తగ్గి లాయల్ సబ్స్క్రైబర్లు పెరగరు.