తిరుమల శ్రీవారి విగ్రహం ఎలా స్వయంభూగా వెలిసిందో ఇప్పటికీ స్పష్టత లేని అద్భుత రహస్యంగా భావిస్తారు భక్తులు.
శ్రీవారి విగ్రహం వెనుక ఎప్పుడూ తేమ ఉండటం శాస్త్రవేత్తలకు సైతం అందని అపూర్వ దైవీయ రహస్యం. ఇది ఇప్పటికీ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేస్తే సముద్రపు అలల ఘోష వినిపిస్తుందని చెబుతారు ఇది భక్తులను విస్మయపరిచే మరో ఆశ్చర్యకర రహస్యం.
శ్రీవారి తలపై నిజమైన జుట్టు ఉండటం, అది ఎప్పటికీ చిక్కులు పడకపోవడం భక్తుల్లో దైవీయ శక్తి నమ్మకాన్ని పెంచుతుంది.
తిరుమల ఆలయంలో దీపం ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతుండటం వెనుక ఉన్న రహస్య కారణం ఇప్పటికీ పూర్తిగా తెలియలేదు.
శ్రీవారి విగ్రహం మొత్తం స్వల్ప ఉష్ణోగ్రత ఉండటం వైద్య నిపుణులను ఆశ్చర్యపరిచే విశేషంగా భావిస్తున్నారు ఇప్పటికీ.
తిరుమల కొండలు ఏడుగురు ఆది శేషుని రూపాలని పురాణాలు చెబుతాయి దీనికి సంబంధించిన గూఢార్థం ఇంకా చర్చనీయాంశమే.
ఆలయంలో ఉపయోగించే ప్రత్యేక కర్పూరం విగ్రహాన్ని దెబ్బతీయకపోవడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.
తిరుమలలో గంటలు మోగిన తర్వాత ప్రతిధ్వని ప్రత్యేకంగా వినిపించడం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే రహస్యంగా భావిస్తారు.