ప్రళయకాలంలో వేదాలను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు చేపరూపంలో అవతరించటం జరిగింది. సత్యాన్ని కాపాడిన మొదటి అవతారంగా ఇది ప్రసిద్ధి పొందింది.
క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతాన్ని మోసేందుకు శ్రీహరి తాబేలు రూపంలో అవతరించారు. దేవాసురులకు సహకరించిన రెండవ దివ్య అవతారం ఇదే.
హిరణ్యాక్షుడు అపహరించిన భూమాతను రక్షించేందుకు విష్ణుమూర్తి వరాహరూపంలో అవతరించి సముద్రగర్భం నుండి భూమిని పైకి తీసుకొచ్చాడు.
భక్త ప్రహ్లాదుడిని రక్షించేందుకు శ్రీహరి అర్ధనరసింహ రూపంలో అవతరించి హిరణ్యకశిపును సంహరించిన ఉగ్రదివ్య అవతారం.
బలిచక్రవర్తి అహంకారాన్ని తగ్గించేందుకు బాలబ్రాహ్మణ రూపంలో వచ్చి మూడు అడుగుల భూమిని అడిగి ముల్లో కాలను జాయించాడు మహావిష్ణువు.
అధర్మంగా ప్రవర్తించిన క్షత్రియులను శిక్షించేందుకు క్షత్రియ సంహారం చేసి ధర్మస్థాపన చేసిన బ్రాహ్మణ యోధుడే పరశురాముడు.
రామాయణంలో రావణాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించేందుకు అయోధ్యలో జన్మించిన ఉత్తమ పురుషోత్తముడు శ్రీరాముడు.
మహాభారత యుద్ధంలో పాండవుల పక్షాన ఉండి వాళ్లకి మార్గదర్శకత్వం చేసి గీతాజ్ఞానాన్ని బోధించిన దివ్య అవతారం శ్రీకృష్ణుడు.
అహింసా సిద్ధాంతాన్ని ప్రచారం చేసి ప్రజలను సత్యమార్గంలో నడిపేందుకు బుద్ధరూపంలో అవతరించిన కరుణామూర్తి విష్ణువు.
కలియుగాంతంలో అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించేందుకు గుర్రంపై ఖడ్గధారి రూపంలో అవతరించనున్న చివరి అవతారమే కల్కి.