మనం నివసిస్తున్న ఈ కలియుగంలో భగవంతుడు ఉన్నాడా? అంటే.. ఈ వింతలు చూస్తే ఎవరైనా 'అవును' అని  అనాల్సిందే!

మధ్యప్రదేశ్‌లోని అసిర్‌ఘర్ కోటలో అశ్వత్థామ ఇప్పటికీ తిరుగుతున్నాడని అంటారు. రోజూ ఉదయం అతను శివుడిని పూజిస్తారని, అందుకే అక్కడ తాజా పువ్వులు కనిపిస్తాయని స్థానికుల నమ్మకం. 

పూరీ జగన్నాథ ఆలయం మీద ఉండే జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. దీని వెనుక ఉన్న కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియదు 

అనంతపురంలోని లేపాక్షి ఆలయంలో ఒక స్తంభం నేలను తాకకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. ఇది ఇప్పటికీ ఇంజనీర్లకు ఒక సవాలే!

కంచిలో వరదరాజ స్వామి విగ్రహం అత్తి చెక్కతో చేయబడింది. ఇది 40 ఏళ్లపాటు నీటిలోనే నానుతూ ఉంటుంది. కేవలం 40 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది.

తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక భాగంలో చెవి పెట్టి వింటే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. ఇది భక్తులు నమ్మే గొప్ప దైవిక శక్తి.

హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలాముఖి ఆలయంలో భూమి నుండి నిరంతరం అగ్ని వెలువడుతుంది. ఎటువంటి ఇంధనం లేకుండా వేల ఏళ్లుగా ఈ జ్వాల ఎలా వెలుగుతుందో ఇప్పటికీ సైన్స్‌కు అంతుచిక్కని రహస్యం.

ఉజ్జయినిలోని కాళభైరవ స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహం దగ్గర మద్యం గిన్నె ఉంచితే, కళ్లముందే ఆ మద్యం మాయమవుతుంది. ఆ విగ్రహంలో మద్యం ఎక్కడికి వెళ్తుందో ఎవరూ కనిపెట్టలేకపోయారు.

ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున పొన్నంబలమేడు కొండపై మూడు సార్లు ఒక దివ్య జ్యోతి కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులు దీనిని ఒక గొప్ప దైవిక మహిమగా భావిస్తారు.

ఇవే కాకుండా మన చుట్టూ మరెన్నో దైవిక శక్తులు ఉన్నాయి. ఈ కలియుగ వింతలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.