రుద్రాక్ష సాక్షాత్తూ పరమశివుని కన్నీటి బిందువు. దీనిని ధరించే ముందు ఈ 7 నియమాలు తప్పనిసరి! అవేంటో తెలుసుకోండి!

కొత్త రుద్రాక్షను నేరుగా ధరించకూడదు. ముందుగా పాలు, నెయ్యి లేదా గంగాజలంతో అభిషేకం చేసి, పూజించాకే ధరించాలి 

రుద్రాక్ష ధరించిన వారు నాన్ వెజ్, ఆల్కహాల్ మరియు సిగరెట్ వంటి అలవాట్లు ఉంటె వాటిని దూరం పెట్టటం శ్రేయస్కరం.

ప్లాస్టిక్ లేదా నకిలీ రుద్రాక్షలు ధరిస్తే ఫలితం ఉండదు. నీటిలో వేస్తే మునిగేవి, స్పష్టమైన ముఖాలు ఉన్నవే అసలైన రుద్రాక్షలని తెలుసుకోండి.

రాత్రి నిద్రపోయేటప్పుడు రుద్రాక్షను తీసి పక్కన పెట్టడం మంచిది. దీనివల్ల రుద్రాక్ష పవర్ తగ్గకుండా ఉంటుంది.

రుద్రాక్షను గౌరవంతో ధరించాలి. ఇది కేవలం ఆభరణం కాదు, అందుకే మీ రుద్రాక్షను వేరొకరికి ఇచ్చి పుచ్చుకోకూడదు 

రుద్రాక్ష ధరించిన తర్వాత రోజూ కనీసం 108 సార్లు 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి.