అమావాస్య నాడు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా ఇతర శుభకార్యాలు చేయకూడదు. ఈ రోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని నమ్మకం. 

ఈ రోజు దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఒంటరిగా అడవులు లేదా నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలి. 

అమావాస్య రోజు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా కొత్త వస్తువులు కొనడం వంటివి ఈ అమావాస్య రోజు చేయకపోవడమే శ్రేయస్కరం.

ఈ రోజు ఎవరితోనూ వాదించకుండా ఉండటం బెటర్. ఇంట్లో గొడవలు పడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించదని పెద్దలు చెబుతుంటారు.

అమావాస్య నాడు తలస్నానం చేయడం, జుట్టు కత్తిరించుకోవడం లేదా గోర్లు తీసుకోవడం వంటివి చేయకుండా ఉండటమే మంచిది.

ఈ రోజు శ్మశానాల వద్దకు లేదా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకూడదు. అక్కడ ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేవాలి. రోజంతా బద్ధకంగా ఉండటం లేదా పగటి నిద్ర పోవడం వంటి  పనులు పొరపాటున కూడా చేయకండి.

ఈ రోజు చెట్లను నరకడం లేదా మొక్కలను తుంచడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇది ప్రకృతికి విరుద్ధమని భావిస్తారు.

ఎవరినీ మోసం చేయకూడదు లేదా అబద్ధాలు చెప్పకూడదు. ఈరోజు వీలైనంత వరకూ మానసిక ప్రశాంతత కోసం దైవ చింతనలో గడపడం ఉత్తమం.