దేవాలయ హుండీలో నాణేలు వేయడం వలన మన కోరికలను దేవుడికి అర్పిస్తున్నామనే నమ్మకంతో ప్రారంభమైన పురాతన పవిత్ర ఆచారం ఇది. 

నాణెం లోహంతో తయారవుతుందనే కారణంగా అది పాజిటివ్ ఎనర్జీని గ్రహించి ఆలయంలో ప్రసారం చేస్తుందని భక్తులు నమ్ముతారు.

హుండీలో నాణెం వేయడం ద్వారా భక్తులకి తమ  సంపాదనలో కొంత భాగం దైవానికి సమర్పించామనే సంతృప్తి భావన కలుగుతుంది.

పురాతన రాజులు మరియు దాతలు నాణేలు సమర్పించి ఆలయ నిర్వహణకు సహాయం చేసిన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. 

లోహ నాణేలు ఆలయ ప్రాంగణంలో ఉన్న శక్తి క్షేత్రాన్ని పెంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని బలపరుస్తాయని నమ్మకం.

నాణేలు వేయడం దానం చేసే అలవాటును పెంచి స్వార్థాన్ని తగ్గించి మనసులో కృతజ్ఞత భావాన్ని పెంపొందిస్తుంది.

హుండీలో సమర్పించిన నాణేలు ఆలయ సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, సామాజిక సేవల వంటి ప్రయోజనాల కోసం వినియోగించబడతాయి.

నాణెం హుండీలో పడేటప్పుడు వచ్చే శబ్దం మన కోరికలు దేవుడి చెవిలో పడినట్లుగా భావించే విశ్వాసం ఉంది భక్తుల్లో