కొత్త వెహికల్ కి నిమ్మకాయలు కట్టడం దృష్టిదోషం దూరం చేస్తుందని ప్రజల విశ్వాసం శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ఇది.

నిమ్మకాయలో ఉన్న ఎసిడిక్ ప్రాపర్టీస్ నెగెటివ్ ఫోర్సెస్ ని  ఎట్రాక్ట్ చేసి వెహికల్ ని సేవ్ చేస్తాయని ఆధ్యాత్మికంగా నమ్ముతారు. 

పసుపు, నిమ్మకాయ కలయిక శుభప్రతీకగా భావించి ఆ వెహికల్ ఎప్పుడూ సేఫ్ జర్నీ కంటిన్యూ చేయాలని ప్రార్థిస్తూ కడతారు.

పూర్వకాలంలో యంత్రాలకు దుష్టశక్తులు చేరకుండా నిమ్మకాయలు ప్రొటెక్షన్ సింబల్ గా ఉపయోగించేవారు అని కొన్ని స్టోరీస్ చెబుతున్నాయి. 

నిమ్మకాయ బ్యాడ్ వైబ్రేషన్లు గ్రహించి  వెహికల్ కి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని జ్యోతిష్య నమ్మకం ఉంది.

కొత్త వస్తువులని మొదటిసారి వినియోగించేప్పుడు ముందుగా శుభశక్తి ఆహ్వానించేందుకు నిమ్మకాయలు కట్టటం పూర్వకాలం నుంచీ ఆచారంగా వస్తుంది.

రోడ్డు ప్రమాదాలు తగ్గాలని, దైవ అనుగ్రహం కలగాలని భావిస్తూ కొత్త వెహికల్స్ కి ప్రతి ఒక్కరూ ఈ ఆచారం పాటిస్తున్నారు.

నిమ్మకాయ చెడు దృష్టిని ఆకర్షించి పగిలిపోతే ప్రమాదం తప్పిందని భావించే సంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఉంది.

సైంటిఫిక్ గా సరైన ప్రూఫ్ లేకపోయినా, మనసుకు ధైర్యం ఇవ్వడం వల్ల కొత్త వెహికల్ కి నిమ్మకాయలు కట్టే ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.