ఆకాశం నుంచి చూస్తే ‘ఓం’లా కనిపించే ఈ శివాలయం గురించి తెలుసా? ఇది సాధారణ నిర్మాణం కాదు… ఆధ్యాత్మిక అద్భుతం! శివుడి మహిమను ఒక్కసారి చూడండి! 

రాజస్థాన్‌లోని పాలి జిల్లా జదన్ అనే గ్రామంలో మహాదేవ్ ఆలయం ఉంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారపు ఆలయం.

భూమిపై నిర్మించిన ఈ శివక్షేత్రం డ్రోన్ వ్యూ ద్వారా చూస్తే పవిత్ర ఓం ఆకారంలో కనిపించి భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఈ ఆలయం మొత్తం  250 ఎకరాల్లో సుమారు 135 అడుగుల ఎత్తులో 2,000 పైగా స్తంభాలతో నిర్మించబడింది. ఇక్కడ  1,008 శివుని విగ్రహాలు మరియు 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు.

ఉత్తర భారత నాగర శైలిలో నిర్మించిన ఈ ఆలయం ఓంకార తత్వాన్ని ప్రతిబింబిస్తూ ప్రపంచానికి ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తోంది.

జపమాలలోని 108 పూసలకు ప్రతీకగా 108 విభాగాలను కలిగి ఉండి ఈ ఆలయం ఎప్పటికీ యూనివర్శల్ సింబల్ గా భావించబడుతోంది.

వేదాలలో ఓం నాదం అనేది సృష్టి మూలమని చెప్తారు. అందుకే  ఈ ఆలయం ఆ తత్వాన్ని నిర్మాణరూపంలో మనకి చూపిస్తోంది.

ఈ ఆలయం మొత్తం నాలుగు విభాగాలుగా నిర్మించారు. ఒక భాగం మొత్తం భూగర్భంలో ఉంటుంది. మిగిలిన మూడు భాగాలు మాత్రం భూమి మీద ఉంటాయి.

శివుడి మహిమను ప్రతిబింబించే ఈ దివ్య నిర్మాణం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచుతూ విశ్వాసాన్ని బలపరుస్తోంది.