రాజస్థాన్‌లోని రణకపూర్ జైన్ టెంపుల్ వైట్ మార్బుల్ శిల్పాలతో నిర్మితమైంది. 1444 స్తంభాలపై నిలిచిన అద్భుత కళాఖండం
మౌంట్ అబులోని దిల్వారా జైన్ టెంపుల్స్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన మార్బుల్ శిల్పాల సమాహారం. ఇక్కడ చెక్కుబొమ్మలు దేవతా రూపాలను అద్భుతంగా ప్రతిబింబిస్తాయి.
గుజరాత్‌లోని శత్రుంజయ పర్వతంపై ఉన్న పాలితానా టెంపుల్ జైనుల పవిత్ర తీర్థం. వేల మెట్లు ఎక్కి చేరే ఈ స్థలం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి ఇస్తుంది.
కర్ణాటకలోని శ్రవణబెలగొళలో ఉన్న గోమ్మటేశ్వర విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల విగ్రహాలలో ఒకటి. జైన మతంలో ఇది మహత్తర ఆధ్యాత్మిక చిహ్నం.
మధ్యప్రదేశ్‌లోని సోనగిరి కొండపై నిర్మించబడిన తెల్లని జైన్ ఆలయాల సమూహం పవిత్ర యాత్రస్థలంగా ప్రసిద్ధి చెందాయి.
ఝార్ఖండ్‌లోని శిఖర్జీ పర్వతం జైనులకు అత్యంత పవిత్ర స్థలం. ఎంతోమంది తీర్థంకరులు ఇక్కడ మోక్షం పొందినట్లు నమ్ముతారు.
అహ్మదాబాద్‌లోని హుటీశింగ్ జైన్ టెంపుల్ సుందరమైన తెల్ల మార్బుల్ నిర్మాణం. అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయం పర్యాటకులను ఆకర్షిస్తుంది.