జైపూర్‌లో ప్రసిద్ధి చెందిన హవా మహల్ గాలి ప్రవాహం కోసం నిర్మించబడిన అద్భుత రాజభవనం. వేల కిటికీలు ఉన్న ఈ మహల్ పింక్ సిటీకి ప్రత్యేక గుర్తు.

అంబర్ ఫోర్ట్ రాజస్థాన్ చరిత్రను చెప్పే గొప్ప కోట. పర్వతంపై నిర్మాణం, అద్దాల మందిరం, రాజవంశ కళాకృతి సందర్శకులను ఇట్టె ఆశ్చర్యపరుస్తాయి. 

సిటీ ప్యాలెస్ జైపూర్ రాజ కుటుంబ నివాసంగా ప్రసిద్ధి. అద్భుత రాజరిక నిర్మాణం, మ్యూజియాలు, సంప్రదాయ వస్త్రాలు, ఆయుధాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ. 

జంతర్ మంతర్ ప్రపంచ ప్రసిద్ధ ఆస్ట్రానామికల్ రీసర్చ్ సెంటర్. మహారాజా జైసింగ్ నిర్మించిన భారీ సన్ డయిల్స్ ఖగోళ శాస్త్రానికి గొప్ప ఉదాహరణ. 

మానసాగర్ సరస్సు మధ్యలో నిలిచిన జల్ మహల్ అద్భుత రాజభవనం. నీటిలో ప్రతిబింబించే నిర్మాణం సాయంత్రం సమయంలో మరింత అందంగా కనిపిస్తుంది.

నహర్‌గఢ్ కోట పర్వత శిఖరంపై నిలిచిన అందమైన కోట. జైపూర్ నగరాన్ని మొత్తం చూడగల అద్భుత వ్యూ పాయింట్ ఇది.

అల్బర్ట్ హాల్ మ్యూజియం రాజస్థాన్ పురాతన చరిత్రను చూపించే ప్రసిద్ధ మ్యూజియం. కళాఖండాలు, పురాతన వస్తువులు, సంస్కృతి ప్రతిబింబించే విలువైన ప్రదర్శనలు.