బాల్యంలో హనుమంతుడు అపార శక్తులతో ఆకాశంలో ఎగిరి దేవతలను, ఋషులను ఆటపట్టించేవాడు. అతని చలాకితనం చూసి వారు కోపగించారు.
హనుమంతుడు సూర్యుడిని పండుగా భావించి తినడానికి దూకినప్పుడు దేవతలు ఆశ్చర్యపోయారు. అతని అసాధారణ శక్తి అప్పుడే ప్రపంచానికి తెలిసింది.
చిన్న వయసులో హనుమంతుడు ఋషులు యజ్ఞాలు, తపస్సులు వంటి పవిత్ర కార్యాలు చేసే సమయంలో వారిని పదేపదే ఇబ్బందులకి గురిచేసేవాడు.
అందుకు కోపించిన ఋషులు ఎవరో గుర్తు చేస్తే మళ్లీ జ్ఞాపకం రాని విధంగా హనుమంతుడు తన శక్తులన్నీ మరిచిపోతాడని శాపం ఇచ్చారు.
ఈ శాపం కారణంగా హనుమంతుడు తన అసలైన బలం గురించి చాలా కాలం వరకూ తెలియక ఓ సాధారణ వానరుడిలా జీవించ సాగాడు.
లంకకు వెళ్లే ముందు జాంబవంతుడు హనుమంతుడికి తన అపార శక్తి గుర్తు చేశాడు. అప్పుడే అతనికి శాపం తొలగినట్లు అయింది.
తన శక్తిని గుర్తు చేసుకున్న హనుమంతుడు సముద్రం దాటి లంక చేరి సీతను కనుగొని రాముడి సేవలో గొప్ప కార్యం చేశాడు