ట్రంప్ పాలసీల వల్ల 2026 ఫిఫా వరల్డ్ కప్, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నిర్వహణపై ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సర్కిల్ లో కొత్త అనుమానాలు పెరుగుతున్నాయి.

అమెరికా WADA బకాయిలు చెల్లించకపోవడంతో, ట్రంప్ సహా ఇతర అమెరికన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి కొద మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో నో ఎంట్రీ ప్రపోజల్ వచ్చింది.  

ఈ  ప్రపోజల్ అమలైతే, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ మాత్రమే కాదు, అమెరికా ఆతిథ్యమివ్వనున్న ఫిఫా వరల్డ్ కప్‌ కి కూడా పొలిటికల్ పంచ్ పడే అవకాశం ఉంది.

మరోవైపు స్ట్రిక్ట్ వీసా పాలసీలు, ఇమ్మిగ్రేషన్ రిస్ట్రిక్షన్స్, మీడియా కంట్రోలింగ్ వరల్డ్ కప్ ఇంటిగ్రిటీని దెబ్బతీయొచ్చని హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి.  

అభిమానులు, జర్నలిస్టులు, కార్మికులు, అధికారులకు అమెరికా ఎంట్రీ కష్టమైతే, ప్రపంచానికి ఆతిథ్యం ఇచ్చే దేశ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఒలింపిక్స్ మేనేజ్మెంట్ మాత్రం ప్లేయర్స్ ఫ్యామిలీస్, ఆఫిషియల్స్ కి మినహాయింపులు ఉంటాయని చెబుతున్నా, సందేహాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు 

ముఖ్యంగా వందల దేశాల నుంచి వచ్చే ప్లేయర్స్, ఫ్యాన్స్, మీడియా ప్రతినిధుల వీసా ప్రక్రియ సులభమా కాదా అనే ప్రశ్న పెద్దదిగా మారిందిప్పుడు. 

ట్రంప్‌కు ఇది కేవలం స్పోర్ట్స్ విషయం కాదు; అమెరికా గ్లోబల్ ఇమేజ్, లీడర్ షిప్, ఇంటర్నేషనల్ ట్రస్ట్ అన్నీ ఒకేసారి పరీక్షించ బడుతున్నాయి.

చివరికి నో ఎంట్రీ నిజమవుతుందా లేదా అనేది తర్వాత విషయం; కానీ ట్రంప్ నిర్ణయాలు ఫిఫా, ఒలింపిక్స్ ముందు పెద్ద తలనొప్పిగా మారాయి/