గూగుల్ మ్యాప్స్‌లో జెమిని నుండీ ‘ఆస్క్ మ్యాప్స్’ ఫీచర్ వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు యూజర్లు నేచురల్ లాంగ్వేజ్ లో ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకోవచ్చు.
ఇది సాధారణ సెర్చ్ కాదండి; కాఫీ షాప్స్, ఫ్యామిలీ ప్లేసెస్, పార్కింగ్, రూట్స్ వంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్ కి పర్సనల్ సజెషన్స్ ఇస్తుంది.
యూజర్ రివ్యూలు, ఫోటోలు, మ్యాప్స్ ఆధారంగా జెమిని సమాధానాలు ఇస్తుంది, కాబట్టి ఒక్క చోటే ఎంతో ఫాస్ట్ గా మరింత స్మార్ట్‌గా యూజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. .
ట్రిప్ ప్లానింగ్ కూడా ఈ ఫీచర్‌తో సులభం; ఎక్కడికి వెళ్లాలి, ఎందుకు వెళ్లాలి, ఏ రూట్ బెస్ట్ అనేదాన్ని చాట్లా మరింత క్లియర్‌గా వెంటనే మీకు చెబుతుంది.
డ్రైవింగ్ సమయంలో కూడా ‘హే గూగుల్’ లేదా జెమిని ఐకాన్ ద్వారా మ్యాప్స్‌తో మాట్లాడొచ్చు; చేతులు తక్కువగా వాడి సమాచారం పొందచ్చు.
ఇండియా, అమెరికాలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ కొత్త ‘ఆస్క్ మ్యాప్స్’ రోల్ఔట్ మొదలైంది; ప్రారంభ దశలోనే ఆసక్తి భారీగా కనిపిస్తోంది.
మ్యాప్స్‌లో ఈ అప్డేట్తో రెస్టారెంట్లు, ట్రావెల్ స్టాప్స్, ఫ్యామిలీ అవుటింగ్స్, వీకెండ్ ప్లాన్స్ వంటి అవసరాలకు తక్షణ సజెషన్స్ దొరుకుతాయి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.
జెమిని మ్యాప్స్ అనుభవాన్ని చాట్లా మార్చేస్తోంది; సెర్చ్ బాక్స్‌లో టైప్ చేయడం కాకుండా నేరుగా మాట్లాడి ప్లాన్ చేసుకోవచ్చు.
ఇంకా ‘ఇమర్సివ్ నావిగేషన్’ వంటి విజువల్ అప్డేట్స్తో రూట్లు, రోడ్డు వివరాలు, పార్కింగ్ గైడెన్స్ మరింత క్లియర్ గా కనిపించేలా గూగుల్ మారుస్తోంది.
మొత్తానికి, గూగుల్ మ్యాప్స్ ఇక కేవలం రూట్ డైరెక్షన్ ఇచ్చే యాప్ కాదు; మాట్లాడి, అర్థం చేసుకుని, వ్యక్తిగతంగా సహాయం చేసే స్మార్ట్ అసిస్టెంట్ లా మారుతోంది ఇప్పుడు.