సైంటిస్టులు రీసెంట్ గా గుర్తించిన L 98-59 d అనే గ్రహం నిజంగా నరకంలాంటి ప్రపంచం అని చెప్పేంత భయంకరంగా కనిపిస్తోంది ఇప్పుడు.

ఈ గ్రహంపై ఉష్ణోగ్రతలు 1,500 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోతూ, రాళ్లని సైతం కరిగించే మాగ్మా సముద్రాలతో  ఉప్పొంగుతూ ఉంటుంది.

ఈ ప్లానెట్ మీద భూమిపై ఉన్నట్లు గట్టి ఉపరితలం ఉండదు. మొత్తం కరిగిన రాళ్లతో నిండిన అగ్నిజల సముద్రంలా ఉంటుంది.  ఒక్కమాటలో చెప్పాలంటే కరిగిన మాగ్మా లా ఉంటుంది.  

ఈ భయంకర గ్రహం చుట్టూ హైడ్రోజన్‌, హైడ్రోజన్ సల్ఫైడ్‌తో నిండిన విషపూరిత వాతావరణం ఉండి, దుర్వాసనతో కూడిన నరక వాతావరణాన్ని సృష్టిస్తోంది.

సాధారణంగా గ్రహాలు చల్లబడుతూ గట్టిగా మారతాయి. కానీ ఇది కోట్ల సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కరిగిన ద్రవ స్థితిలోనే ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.  

ఈ గ్రహం మన సౌరవ్యవస్థలో కాదు; ఇది భూమికి సుమారు 35 కాంతి సంవత్సరాల దూరంలో ఒక ఎర్ర నక్షత్రం చుట్టూ తిరుగుతోంది.

భూమికంటే సుమారు 60 శాతం పెద్దదైనా, దీని సాంద్రత తక్కువగా ఉండటంతో అంతర్గత నిర్మాణం పూర్తిగా భిన్నంగా ఉండొచ్చని రీసర్చెస్ చెబుతున్నాయి.  

ఈ గ్రహంపై జీవం ఉండే అవకాశాలు దాదాపు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఎందుకంటే ఇక్కడి వేడి, విషవాయువులు జీవానికి అస్సలు అనుకూలం కావు.

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ సహాయంతో జరిగిన పరిశీలనలు, మన ఊహలకు అందని కొత్త రకం గ్రహాల ప్రపంచాన్ని బయటపెడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.  

L 98-59 d ఆవిష్కరణతో, విశ్వంలో భూమిలాంటి గ్రహాలే కాదు, నరకంలాంటి ద్రవ అగ్ని ప్రపంచాలూ ఉన్నాయని స్పష్టమైందిప్పుడు.