నాసా ఫుటేజ్‌లో మార్స్ ప్లానెట్ పై ఈజిప్ట్ తరహా పిరమిడ్లను పోలిన ఆకార నిర్మాణం కనిపించడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది.
ఈ విజువల్స్ లేటెస్ట్ వి కావు. 2001లో మార్స్ గ్లోబల్ సర్వేయర్ మిషన్ సమయంలో తీసినవని గుర్తించారు. అయినప్పటికీ వాటిని మళ్లీ వైరల్ చేశారు
పై నుంచి చూసినప్పుడు ట్రయాంగిల్ అపెక్స్ షేప్ లా కనిపిస్తుంది. అందుకే ఇది ఈజిప్టు పిరమిడ్‌లాంటి మానవ నిర్మిత నిర్మాణమా అని డౌట్ వస్తుంది.
అయితే నాసా సైంటిఫిక్ వ్యూ ప్రకారం చూస్తే, ఇలాంటి ఆకారాలు గాలి, ధూళి, ఎరోషన్, మరియు జియోలాజికల్ ప్రాసెస్ వల్ల నేచురల్ గా ఏర్పడే అవకాశమే ఎక్కువ.
మార్స్‌లో సైడోనియా అనే ప్రాంతం గతంలోనూ ‘ఫేస్’ మరియు ‘డిఅండ్‌ఎం పిరమిడ్’ వంటి ఆకారాలతో అనేక ఊహాగానాలకు కేంద్రంగా నిలిచింది.
తక్కువ రిజల్యూషన్ విజువల్స్ లో లైట్, షాడోస్, యాంగిల్స్ కలిసి సాధారణ రాళ్లనే అసాధారణ నిర్మాణాల్లా చూపించే ఆప్టికల్ ఇల్యూజన్స్ తరచూ జరుగుతాయి.
అందుకే కొందరు దీనిని పురాతన నాగరికత ఆనవాళ్లుగా ప్రచారం చేస్తున్నా, దానికి మద్దతుగా ఇప్పటివరకు ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు.
మార్స్‌పై విచిత్రమైన జియోమేట్రిక్ షేప్స్ కనిపించిన ప్రతీసారి ప్రజల్లో ఎలియన్ నిర్మాణాల ఊహలు పెరుగుతాయి, కానీ శాస్త్రవేత్తలు వాటిని ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేస్తూనే ఉన్నారు.
ఇదే సమయంలో మరో విచిత్ర మార్స్ ఆబ్జెక్ట్ గురించి ఆస్ట్రోనమర్ అవి లోబ్ ఇటీవల మరింత రీసర్చ్ చేయాలని నాసాకు సూచించారు.
కాబట్టి ఈ ‘మార్స్ పిరమిడ్’ ప్రస్తుతం మిస్టరీయే అయినా, సైన్స్ చెబుతున్నదేమిటంటే, ముందుగా దీనిని నేచురల్ జియోలాజికల్ స్ట్రక్చర్ గానే చూడాలి అని.