భూమికి కేవలం 10.7 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న GJ 887 అనే రెడ్ కలర్ స్టార్ ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని బలంగా ఆకర్షిస్తోంది.
ఈ స్టార్ చాలా కూల్ గా ఉండడం వల్ల దాని చుట్టూ తిరిగే గ్రహాల సంకేతాలు స్పష్టంగా కనిపించి, జీవం అన్వేషణకు అద్భుత అవకాశమిచ్చింది.
GJ 887 అనేది ఒక మరగుజ్జు నక్షత్రం. ఇలాంటి చిన్న తారలు గెలాక్సీలో సాధారణమే కానీ, ఇంత నిశ్శబ్ద స్వభావం ఉండటం మాత్రం అరుదైన విషయం అనే చెబుతున్నారు.
తాజా పరిశోధనల ప్రకారం, ఈ తార చుట్టూ కనీసం నాలుగు గ్రహాలు ఉన్నాయట; వాటిలో ఒకటి జీవానికి అనుకూల మండలంలో ఉండొచ్చని భావిస్తున్నారు.
హ్యాబిటబుల్ జోన్ లో ఉన్న సూపర్-ఎర్త్ గ్రహం, ప్రోక్సిమా సెంటౌరి బి తర్వాత మనకు అత్యంత దగ్గరలో ఉన్న గ్రహం గా నిలుస్తోంది.
ఈ నక్షత్రంపై వెలుగులో మార్పులు తక్కువగా ఉండటం వల్ల గ్రహాల వాతావరణాలను భవిష్యత్ టెలిస్కోపులతో ఈజీగా స్టడీ చేయవచ్చు.
HARPS, ESPRESSO వంటి పవర్ ఫుల్ పరికరాలతో ఈ నక్షత్రం కదలికలను మరియు దాని చుట్టూ దాగి ఉన్న గ్రహాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
HARPS, ESPRESSO వంటి పవర్ ఫుల్ పరికరాలతో ఈ నక్షత్రం కదలికలను మరియు దాని చుట్టూ దాగి ఉన్న గ్రహాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
ఇలాంటి నిశ్శబ్ద తారల చుట్టూ గ్రహాలు ఉంటే, తీవ్ర తార తుఫాన్లు తక్కువగా ఉండి జీవం అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువవుతాయని అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అందుకే మనకు దగ్గరలోనే జీవానికి ఆశ చూపిస్తున్న అత్యంత ముఖ్యమైన తారగా GJ 887 ఇప్పుడు నిలిచినట్లు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.