శాస్త్రవేత్తలు రీసెంట్ గా భూమిలాంటి 45 గ్రహాలను గుర్తించారు, వీటిలో ఏదో ఒక  గ్రహంపై ఏలియన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ గ్రహాలు తమ నక్షత్రాల హ్యాబిటబుల్ జోన్ లో ఉండటం వల్ల, అక్కడ ద్రవరూప నీరు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని రీసర్చర్స్ చెబుతున్నారు.

మొత్తం 6,000 కంటే ఎక్కువ ఉన్న ఎక్సోప్లానెట్లలో నుంచి, జీవానికి సరిపోయే అవకాశాలున్న కేవలం 45 రాతి గ్రహాలను ప్రత్యేకంగా ఎంపిక చేశారు శాస్త్రవేత్తలు.  

ఈ లిస్టులో ప్రాక్సిమా సెంటౌరి బి, ట్రాపిస్ట్-1 గ్రహాలు, కెప్లర్ కుటుంబంలోని కొన్ని ప్రపంచాలు కూడా ఉండటం శాస్త్రవేత్తలకు మరింత ఆశ కలిగించింది.

భూమికి వచ్చే సౌరశక్తితో సమానమైన కాంతి, వేడి అందుకునే గ్రహాలనే ముందుగా ఎంపిక చేయడంతో ఈ లిస్టు మరింత పాపులర్ అయింది.

పరిశోధకుల లక్ష్యం ఎలియన్స్ కనిపించాయనే కాదు, జీవం ఉండే అవకాశాలున్న ప్రపంచాలను ముందుగా ఖచ్చితంగా గుర్తించి టెలిస్కోపులతో గమనించడం మాత్రమే. 

ట్రాపిస్ట్-1 ఈ, ట్రాపిస్ట్-1 ఎఫ్, ట్రాపిస్ట్-1 జీ వంటి గ్రహాలు భూమిలాంటి ఎట్మాస్ఫియర్ కలిగి ఉండి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన లక్ష్యాలయ్యాయి.

జేమ్స్ వెబ్ వంటి శక్తివంతమైన టెలిస్కోపులు ఈ గ్రహాల వాతావరణాలను పరిశీలించి, నిజంగా జీవానికి సంకేతాలున్నాయా అనే రహస్యం ఛేదించనున్నాయి.  

శాస్త్రవేత్తలు ఈ 45 గ్రహాలను భవిష్యత్తు పరిశోధనలకు టాప్ లక్ష్యాలుగా ప్రకటించడంతో, విశ్వంలో మనం ఒంటరి కాదు అనే ప్రశ్న మళ్లీ లేచింది.

ఎలియన్స్ నిజంగానే ఉన్నారో లేదో ఇంకా తెలియదు, కానీ జీవం దాగి ఉండొచ్చని ఆశ కలిగించే 45 ప్రపంచాలు మాత్రం ఇప్పుడు మన ముందున్నాయి.