“భారత్” అనే పేరు చాలా ప్రాచీనమైనది, ఇది భారతీయ సంస్కృతి, చరిత్ర, పురాణాలతో ఎంతో గాఢంగా ముడిపడి  ఉంది.

పురాణాల ప్రకారం దుష్యంతుడు, శకుంతలల కుమారుడు భరతుడు ఈ దేశాన్ని చాలా కాలంపాటు పరిపాలించాడు. ఆయన పేరు మీద వచ్చిందే ఈ భారతదేశం. 

మహాభారతం భరత వంశ ఇతివృత్తంతో ముడిపడి ఉన్న  ప్రాచీన పురాణ గాధ. అందుకే ఈ భూమిని భరత భూమి అని పిలుస్తారు.

సంస్కృత గ్రంథాల్లో “భారతవర్ష” అనే పదం విస్తృతంగా కనిపిస్తుంది, ఇది భారత భూభాగానికి పాత పేరుగా భావించబడింది.

విష్ణు పురాణం వంటి గ్రంథాల్లో హిమాలయాల దక్షిణాన ఉన్న ఈ భూమిని భరత ఖండంగా పేర్కొన్నట్లు వివరణలు ఉన్నాయి.

“భారత్” అనే పేరు కేవలం భూభాగానికే కాదు, ఇక్కడి ప్రజల సంప్రదాయం, జ్ఞానం, ఆధ్యాత్మికతకు కూడా ప్రతీకగా నిలిచింది.

కొంతమంది పండితులు భారత్ లో “భా” అంటే వెలుగు, “రత్” అంటే ఆసక్తి; అందుకే జ్ఞానంలో ఆసక్తి ఉన్న దేశం అని భావిస్తారు.

బ్రిటిష్ కాలంలో “ఇండియా” పేరు ఎక్కువగా ప్రాచుర్యం పొందినా, భారతీయుల మనసుల్లో “భారత్” పేరుకే ప్రత్యేక స్థానం ఉంది.

మన రాజ్యాంగం మొదటి ఆర్టికల్‌లోనే “India, that is Bharat” అని స్పష్టంగా పేర్కొనడం ఈ పేరుకు అధికారిక గుర్తింపు ఇచ్చింది.

అందుకే “భారత్” పేరు చరిత్ర, పురాణం, సంస్కృతి, రాజ్యాంగం అన్నింటినీ కలిపే మన దేశ ఆత్మను ప్రతిబింబించే పేరుగా నిలిచింది.