జపాన్ సైంటిస్టులు పసిఫిక్ ఓషన్ లోని కురిల్-కమ్ చాట్కా ట్రెంచ్ వద్ద 6,200 మీటర్ల లోతులో వింత నల్ల గుడ్లలాంటి గుండ్రని నిర్మాణాలను గుర్తించారు.
ఆ బ్లాక్ ఎగ్స్ ఒక రాయికి అంటుకుని కనిపించాయి; తీవ్ర ఒత్తిడి, చీకటి, చలితో నిండిన సముద్ర గర్భంలో ఇవి కనిపించడం ఎక్స్ ప్లోరర్స్ ని ఆశ్చర్యపరిచింది.
మొదట ఇవి సాధారణ గుడ్లా, లేక మరో జీవి అవశేషాలా అనుమానం వచ్చింది; అందుకే నమూనాలను జాగ్రత్తగా పైకి తీసుకువచ్చి రీసర్చ్ చేశారు.
ల్యాబ్ లో వాటిని బ్రేక్ చేసి చూస్తే, లోపల తెల్లటి, మృదువైన చిన్న జీవులు కనిపించాయి; అప్పుడే ఇవి సాధారణ గుడ్లు కావని స్పష్టమైంది.
తరువాతి ఎనాలిసిస్ లో ఆ ఎగ్స్ లో పెరుగుతున్న జీవి లైఫ్ సర్కిల్ చూసి ఆవు ఫ్లాట్‌వార్మ్‌ల కోకూన్లు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
ప్రతి కోకూన్ సుమారు 3 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండగా, వాటిలో మూడు నుంచి ఏడు వరకు చిన్న ఫ్లాట్‌వార్మ్‌లు ఉన్నట్లు గుర్తించారు.
కొన్ని కోకూన్లలో ఎర్లీ స్టేజ్ లో ఉన్న ఇన్ఫాంట్స్ కనిపించగా, మరికొన్నింటిలో పురుగు ఆకారానికి మారుతున్న డెవలప్డ్ స్టేజ్ కనిపించింది
డీఎన్‌ఏ పరీక్షల తర్వాత ఇవి ట్రిక్లాడిడా వర్గానికి చెందిన మారికోలా ఉపవర్గ ఫ్లాట్‌వార్మ్‌లు అని, బహుశా కొత్త జాతి కావచ్చని తేలింది.
ఈ ఇన్నోవేషన్ స్వేచ్ఛగా జీవించే ఫ్లాట్‌వార్మ్‌లు ఇంత లోతులో నమోదు కావడం ఇదే మొదటిసారి అని, సైంటిఫిక్ వరల్డ్ లో ప్రత్యేక రికార్డు సృష్టించింది.
సముద్ర గర్భంలోని కఠిన పరిస్థితుల్లో కూడా జీవం ఎలా బ్రతుకుతుందో తెలియజేస్తూ, ఈ బ్లాక్ కోకూన్లు మహాసముద్ర రహస్యాలపై కొత్త ప్రశ్నలు లేపాయి.