నాసా పెర్సెవరెన్స్ రోవర్ మార్స్‌లోని జెజెరో క్రేటర్ అడుగున పురాతన నది డెల్టా ఆనవాళ్లు గుర్తించి, అక్కడ ఎప్పుడో విపరీతంగా నీరు ప్రవహించినట్లు తెలిపింది.
నేలమట్టం కింద దాగిన పొరలను రాడార్‌తో పరిశీలించగా ఈ నీటి జాడలు బయటపడ్డాయి, మార్స్ చరిత్రలో నీటి పాత్ర ఇప్పుడు మరింత స్పష్టమైంది.
జెజెరో క్రేటర్ ఒకప్పుడు సరస్సుగా ఉండి, దానిలో ఒక నది వచ్చి చేరి డెల్టా నిర్మించిందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు.
ఇప్పుడు కనుగొన్న భూగర్భ జలాలు, ఉపరితలం మీద కనిపించిన వాటికంటే ఇంకా పాతవై ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పెర్సెవరెన్స్ ఉపయోగించిన రిమ్‌ఫ్యాక్స్ రాడార్ పరికరం, నేల అడుగున దాగిన పొరలు, నది మార్గాలు, డెల్టా ఆకారాలను స్పష్టంగా గుర్తించింది.
రీసర్చర్స్ ప్రకారం ఈ వాటర్ సిస్టమ్ సుమారు 3.7 నుంచి 4.2 బిలియన్ సంవత్సరాల కిందట మార్స్‌పై నీరు ఉన్న కాలాన్ని సూచిస్తోంది.
ఒకప్పుడు ఇక్కడ వేడి వాతావరణం, మందమైన గాలి పొర, ప్రవహించే నదులు ఉన్నాయని తెలుపుతూ మార్స్ గతాన్ని ప్రపంచానికి కొత్తగా చూపిస్తోంది.
నీరు ఉన్న ప్రదేశాలే జీవులు జీవించడానికి అనుకూలమని భావించడంతో, ఈ ప్రాంతం గత జీవం ఆనవాళ్ల కోసం మరింత పాపులర్ అయింది..
జెజెరో క్రేటర్‌లో సేకరించిన రాళ్లు, మట్టి పొరలు, ఖనిజాలు భవిష్యత్తులో మార్స్‌పై జీవం ఉందా అనే ప్రశ్నకు ఏదో ఒకరోజు సమాధానం ఇవ్వవచ్చు.
మార్స్ ఎప్పుడో ఎండిన ఎర్రగ్రహం మాత్రమే కాదు, భారీగా నీటితో నిండిన చురుకైన చల్లని గ్రహం కూడా అనే భావనకు ఇది బలమైన సాక్ష్యం.