హబుల్ స్పేస్ టెలిస్కోప్ రీసెంట్ గా ‘ఈవిల్ ఐ’ గెలాక్సీని చిత్రీకరించి, అంతరిక్ష ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచేసింది

ఈ గెలాక్సీ అఫీషియల్ గా M64గా గుర్తించబడింది, కానీ దీని సెంటర్ లోని భయంకర ఆకారం కారణంగా ‘ఈవిల్ ఐ’ అనే పేరు వచ్చింది. 

గెలాక్సీ సెంటర్ పార్ట్ లో కనిపించే బ్లాక్ డస్ట్ స్ట్రిప్, ఓ పెద్ద ఐ షేప్ లో కనిపిస్తూ దీనికి ప్రత్యేకమైన భయానక రూపం ఇస్తోంది.

సైంటిస్టులు చెబుతున్నదేమంటే, ఈ గెలాక్సీలో నక్షత్రాలు వేరువేరు దిశల్లో తిరుగుతూ ఉండటం రేర్ ఆస్ట్రనామికల్ మిస్టరీగా భావిస్తున్నారు.

బయట గ్యాస్ పొరలు ఒక దిశలో కదులుతుంటే, లోపలి స్టార్ క్లస్టర్ మరో దిశలో తిరగడం శాస్త్రజ్ఞులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ విచిత్ర గమనానికి కారణం గతంలో జరిగిన గెలాక్సీ ఢీకొనడం లేదా విలీనం కావచ్చని ఖగోళ పరిశోధకులు భావిస్తున్నారు ప్రస్తుతం జాగ్రత్తగా స్టడీ చేస్తున్నారు.

హబుల్ తీసిన క్లియర్ ఇమేజ్ కాప్చర్ ద్వారా ధూళి, నక్షత్ర కాంతి, గెలాక్సీ నిర్మాణం మరింత అందంగా మరియు స్పష్టంగా బయటపడింది. 

ఈవిల్ ఐ’ గెలాక్సీ భూమి నుంచి సుమారు 17 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మ్యాగ్నఫిషియంట్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ గా గుర్తించబడింది.

ఇంత భయంకర పేరున్న, ఈ గెలాక్సీని విశ్వంలోని అందమైన నిర్మాణాల్లో ఒకటిగా ఖగోళ ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, పరిశోధకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

హబుల్ చిత్రీకరించిన ఈ దృశ్యం విశ్వంలో ఇంకా ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయని మరోసారి మనకు గుర్తు చేస్తోంది.