పూరీ జగన్నాథ ఆలయం పరిసరాల్లో భూగర్భంలో సొరంగంలా కనిపించిన భారీ నిర్మాణం, పురాతన అవశేషాలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకేత్తిస్తోంది.
అధికారులు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి డిగ్గింగ్ చేయగా, భూమి అడుగున మరిన్ని నిర్మాణాలు కనిపించినట్లు అఫీషియల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
బయటపడిన నిర్మాణాన్ని కొందరు సముద్రానికి వెళ్లే రహస్య మార్గంగా ఊహిస్తున్నా, దాని అసలు ఉపయోగం గురించి ఇంకా నిర్ధారణ కాలేదు.
ఈ నిర్మాణాలన్నీ జగన్నాథ టెంపుల్ యొక్క ఓల్డ్ కన్స్ట్రక్షన్ ప్లాన్, లేదా టెంపుల్ ప్రొటెక్షన్ ప్లాన్ అయి ఉండవచ్చని చరిత్రకారులు ఊహిస్తున్నారు.
ఈ ప్రాంతం చారిత్రకంగా మరింత ప్రాచీన పట్టణ నిర్మాణాలతో ముడిపడి ఉండొచ్చని భావిస్తూ, పురాతత్వ నిపుణులు జాగ్రత్తగా తవ్వకాలు జరుపుతున్నారు.
పూరీ భారతదేశంలోని అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా ఉండటంతో, ఈ డిస్కవరీ అటు భక్తుల్లోనూ, ఇటు చరిత్రకారుల్లోనూ ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది
పూర్తి తవ్వకాలు ఇంకా జరగకపోవడంతో, భూమి అడుగున నిజంగా ప్రాచీన నగర అవశేషాలున్నాయా అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ మిగిలే ఉంది .
అధికారులు మరిన్ని సర్వేలు, డాక్యుమెంటేషన్, సైంటిఫిక్ ఎనాలిసిస్ చేసిన తర్వాతే ఈ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ వయస్సు, స్వరూపం, ప్రయోజనం స్పష్టమవుతాయని చెబుతున్నారు.
ఈ డిస్కవరీ పూరీ వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యం పెంచుతూ, భవిష్యత్తులో పర్యాటక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో పెద్ద చర్చలకు దారితీయొచ్చు అని నిపుణులు భావిస్తున్నారు.
మొత్తానికి, ఈ టన్నెల్ స్టోరీ వైరల్ అయినా నిజానిజాలు తేలాలంటే అఫీషియల్ రీసర్చెస్ పూర్తవ్వాలి; అప్పటివరకు ఇది అత్యంత రహస్యంగానే మిగులిపోతుంది.