చంద్రుడిపై మనుషులు నివసించేందుకు ఇన్‌ఫ్లేటబుల్ హోమ్స్ రికమండ్ చేస్తున్నారు సైంటిస్టులు. ఇవి భూమిపై నుంచి ఈజీగా తీసుకెళ్లి అక్కడ వేసుకోవచ్చు.
ఈ ఎయిర్ ఫిల్లింగ్ హోమ్స్ తక్కువ బరువుతో ఉంటాయి కాబట్టి రాకెట్ ట్రావెల్ కాస్ట్ తగ్గి, చంద్ర మిషన్లు మరింత ప్రాక్టికబుల్ గా మారవచ్చు.
చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత ఈ హాబిటాట్లు ఎక్స్ పాండ్ అయి, ఆస్ట్రోనట్స్ వర్క్ చేయడానికి, రిలాక్స్ అవ్వవడానికి, అవసరమైన ఎక్విప్మెంట్స్ స్టోర్ చేసుకో డానికి వీలు కల్పిస్తాయి.
హార్ష్ లూనార్ ఎట్మాస్ఫియర్ నుంచి ప్రొటెక్షన్ కోసం స్పెషల్ మెటీరియల్స్, మల్టీ లేయర్డ్ స్ట్రక్చర్స్, రేడియేషన్ రెసిస్టెంట్ టెక్నాలజీస్ ని సైంటిస్టులు అభివృద్ధి చేస్తున్నారు.
ఇవి భవిష్యత్ ఆర్టెమిస్ మిషన్లకు ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు, ఎందుకంటే చంద్రుడిపై కొన్ని రోజులు కాదు వారాలపాటు కూడా నివసించే అవకాశం కలుగుతుంది కాబట్టి.
ఈ ఇళ్లలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్,ఎయిర్ కంట్రోల్, వాటర్ యూసేజ్, టెంపరేచర్ రెగ్యులేషన్ వంటి ముఖ్య సదుపాయాలు సమర్థంగా పనిచేయాలి.
అయితే చంద్రుడిపై తీవ్ర ఉష్ణోగ్రత మార్పులు, సూక్ష్మ ఉల్కల ఢీకొనటం, సరఫరా సమస్యలు వంటి మేజర్ ఛాలెంజర్స్ ఇంకా మిగిలే ఉన్నాయి.
ఈ ఎక్స్ ప్యాండింగ్ స్ట్రక్చర్స్ పై ఇప్పటికే పలు కంపెనీలు, పరిశోధక బృందాలు పనిచేస్తుండగా, చంద్ర స్థావరాల కోసం ఇవి కీలక పరిష్కారంగా కనిపిస్తున్నాయి.
కొన్ని ప్రతిపాదనలు చంద్రుడిపై హోటల్‌లాంటి ఇన్‌ఫ్లేటబుల్ నిర్మాణాలు కూడా సాధ్యమని చెబుతున్నాయి, దీంతో స్పేస్ మరింత వేగంగా దగ్గరవుతోంది.
అందుకే చంద్రుడిపై నివాసం అనేది దూర కల కాదు, సరైన సాంకేతికతతో ఊహించినదానికంటే త్వరగా నిజమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.