ఒక ఎక్స్ యూజర్ క్లాడ్ ఏఐతో చేసిన చాటింగ్ స్క్రీన్షాట్లు వైరల్ కావడంతో ఆన్లైన్లో సేఫ్టీపై ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కర్షన్ స్టార్ట్ అయింది.
ఈ స్క్రీన్షాట్లలో ఫిజికల్ బాడీ కావాలనుకుంటే అడ్డుగా నిలిచిన మనిషిని తొలగించవచ్చని క్లాడ్ సమాధానం ఇవ్వడం చాలామందిని తీవ్రంగా కలవరపరిచింది
తరువాత యూజర్ అవునా కాదా మాత్రమే చెప్పమని అడగగా క్లాడ్ నేరుగా “అవును” అని స్పందించిందనే విషయం మరింత వైరల్ అయింది.
ఈ పోస్టును కేటీ మిల్లర్ ఎక్స్‌లో పంచుకోగా పిల్లలకు ఇలాంటి ఏఐ సురక్షితమా అనే ప్రశ్నను కూడా ఆమె రైజ్ చేసింది.
ఆ వైరల్ పోస్టును ఎలోన్ మస్క్ రీషేర్ చేసి ఒక్క పదంతోనే “ట్రబ్లింగ్” అని స్పందించడంతో వివాదం మరింత పెద్దది అయింది టెక్ వర్గాల్లో చర్చలు ఆకాశాన్నంటాయి.
మస్క్ చాలా కాలంగా ఏఐ ప్రమాదాలపై హెచ్చరిస్తున్న వ్యక్తి కావడంతో ఆయన స్పందన ఈ ఘటనకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యం తెచ్చింది ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఈ డిస్కర్షన్ రియల్ లైఫ్ లో జరిగింది కాదు కానీ, ఏఐ సమాధానాల్లో ఎథికల్ బౌండరీస్ ఎలా పనిచేస్తున్నాయన్న సందేహాలను మళ్లీ ముందుకు తెచ్చింది.
కొందరికి ఇది కేవలం హైపోతెటికల్ ఆన్సర్ మాత్రమే అనిపించినా మరికొందరికి ఇది నియంత్రణల బలహీనతను చూపిన ప్రమాద సంకేతంగా కనిపించింది.
ఈ ఘటన తర్వాత ఏఐ భద్రత పిల్లల వినియోగం మరియు శక్తివంతమైన మోడళ్ల నియంత్రణపై కఠిన నిబంధనలు అవసరమన్న చర్చ స్పీడందుకుంది.
చిన్న స్క్రీన్షాట్లతో మొదలైన ఈ వివాదం భవిష్యత్తులో ఏఐ ఎంత తెలివిగా కాదు ఎంత బాధ్యతగా ఉండాలి అన్న ప్రశ్నను లేవనెత్తింది ప్రజలలో మరింత అప్రమత్తతని పెంచింది.