గూగుల్‌లో ఇంటర్నల్ టెస్టింగ్ చేస్తున్న Agent Smith అనే AI టూల్ ఉద్యోగుల మధ్య వేగంగా పాపులర్ అవుతోంది అందుకే యాక్సెస్‌కే పరిమితులు పెట్టారట ఇప్పుడు.

ఇది సాధారణ చాట్‌బాట్ కాదు; కోడింగ్, వర్క్‌ఫ్లో మేనేజ్మెంట్, ఇంటర్నల్ టూల్స్‌తో కనెక్షన్ వంటి పనులు స్వయంగా చేపట్టగల ఏజెంట్‌.

ఉద్యోగులు ల్యాప్‌టాప్ ముందు కూర్చోకుండానే ఫోన్ నుంచే పని అప్పగించి, తర్వాత ప్రోగ్రెస్ చూసే విధంగా ఇది అసింక్రోనస్‌గా  వర్క్ చేస్తుందని చెబుతున్నారు.

Agent Smith గూగుల్ యొక్క Antigravity అనే ఇంటర్నల్  ఏజెంటిక్ కోడింగ్ ప్లాట్‌ఫామ్‌పై బిల్డ్ చేయబడిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి, అందువల్ల దీని సామర్థ్యం ఎక్కువ.

ఈ టూల్ ఎంప్లాయీ ప్రొఫైల్‌కు కనెక్ట్ అయిన డాక్యుమెంట్లు, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇంటర్నల్ సిస్టమ్స్ డేటాను తెచ్చుకుని పని పూర్తి చేయగలదని తెలుస్తోంది.

కోడ్ రాయడం మాత్రమే కాదు; వర్క్ సీక్వెన్స్ ని ప్లాన్ చేయడం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, వర్క్‌ఫ్లో ముందుకు తీసుకెళ్లడం కూడా దీని బలంగా కనిపిస్తోంది.

ఉద్యోగులు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక టూల్ బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేస్తూ, తర్వాత రిజల్ట్ చూపడం వల్ల టైం సేవ్ అవుతోందని రిపోర్టులు చెబుతున్నాయి. 

గూగుల్‌లో AI యూసేజ్ పై ప్రెజర్ ఎక్కువవుతున్న  సమయంలో Agent Smith వంటి టూల్స్ సంస్థ భవిష్యత్ పనితీరులో కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు.

ఈ టూల్ ఎంత ఫాస్ట్ గా పాపులర్ అయిందంటే, కంపెనీ లోపలే డిమాండ్ నియంత్రించేందుకు కొన్ని యూసేజ్ లిమిట్స్ అమలు చేసినట్టు వార్తలు వచ్చాయి

అఫీషియల్ డీటెయిల్స్ లిమిటెడ్ గానే ఉన్నా, Agent Smith గూగుల్‌లో సెల్ఫ్ - కంట్రోల్డ్ AI ఏజెంట్ల దిశగా ఒక బిగ్ సిగ్నల్ గా కనిపిస్తోంది.