గిజా పిరమిడ్ల కింద రెండో స్ఫింక్స్ దాగి ఉందన్న క్లెయిమ్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది, కానీ నిపుణులు దీనిని నిరాధారమని కొట్టిపారేశారు.

ఇటాలియన్ రీసర్చర్స్ రాడార్ స్కాన్ల ఆధారంగా ఇసుక కింద భారీ నిర్మాణం ఒకటి ఉందని చెప్పారు, అది  రెండో స్ఫింక్స్ కావచ్చని ఊహించారు.

ఈ క్లెయిమ్‌లో 108 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహం, భూగర్భ మార్గాలు, గదులు ఉండొచ్చని చెప్పడంతో ప్రపంచ దృష్టిని  ఆకర్షించింది.

అయితే ఆర్కియాలజిస్తులు చెబుతున్నది ఏంటంటే, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగలేదు, అందువల్ల ఇది కేవలం ఒక రూమర్ అని వివరించారు.

ఈజిప్టు ఫార్మర్ ఆర్కియాలజీ మినిస్టర్ జాహి హవాస్ ఇలాంటి వాదనలను గతంలో కూడా వినిపించాయని అవి ఫేక్ అని కొట్టి పారేశారు.

గిజా ప్రాంతం దశాబ్దాలుగా విస్తృతంగా అధ్యయనం చేయబడిందని, అక్కడ మరో స్ఫింక్స్ ఉంటే ఇప్పటికి ఆధారాలు బయటపడేవని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

పరిశోధకులు ప్రస్తావించిన డ్రీమ్ స్టీలేలో రెండు స్ఫింక్స్ ఆకృతులు కనిపించినా, హిస్టారియన్స్ వాటినిసింబాలిక్ ఇమేజస్ గానే భావిస్తున్నారు.

రిమోట్ సెన్సింగ్ డేటా మాత్రమే సరిపోదని, పీర్ రివ్యూడ్ స్టడీస్, ఆథరైజ్డ్ పర్మిషన్, ఫిజికల్ ఎక్స్ కవేషన్స్ తప్పనిసరి అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అందుకే రెండో స్ఫింక్స్ స్టోరీ ప్రస్తుతం సైంటిఫిక్ ట్రూత్  కాదు, సోషల్ మీడియా ఊహాగానంగా మాత్రమే మిగిలిందని ఫ్యాక్ట్ చెకర్లు తేల్చారు

గిజా రహస్యాలపై క్యూరియాసిటీ ఎప్పటికీ తగ్గదు, కానీ సెన్సేషనల్ న్యూస్ కన్నా వెరిఫైడ్ ఎవిడేన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు.