హనుమంతుడి గద కేవలం యుద్ధానికి ఆయుధం మాత్రమే! కానీ, ఆయన తోక అవమానానికి ప్రతీకారం తీర్చుకొనే పవర్ ఫుల్ వెపన్.
లంకలో రావణసేన హనుమంతుడి తోకకు నిప్పంటించగా, అదే తోక మొత్తం లంకను అగ్నికుండంగా మార్చి వారి గర్వాన్ని దహనం చేసింది.
గదతో శత్రువులను ఓడించవచ్చు, కానీ తోకతో హనుమంతుడు శత్రురాజ్యాన్నే కుదిపేశాడు; అందుకే అది మరింత శక్తివంతమైనదిగా భావిస్తారు.
హనుమంతుడి తోక ఆయన అపారమైన చైతన్యానికి ప్రతీక; అవసరాన్ని బట్టి పెరుగుతుంది, కదులుతుంది, శత్రువులను ఆశ్చర్యంలో ముంచెత్తే దివ్యశక్తి కలిగి ఉంటుంది.
రావణ సభలో తోకను చుట్టలా చుట్టి దానిపై ఎక్కి కూర్చోవడం ద్వారా హనుమంతుడు, తన పరాక్రమం ముందు లంకాధిపతి చిన్నవాడని గర్వంగా చూపించాడు.
గద చేతిలో ఉండే బాహ్య ఆయుధం, కానీ తోక ఆయన శరీరంలో భాగం; అందుకే అది సహజబలం, అంతర్గత శక్తికి ప్రతీకగా నిలుస్తుంది.
హనుమంతుడి తోక అవమానాన్ని అవకాశంగా మార్చిన చిహ్నం; శత్రువుల పన్నాగాన్నే విజయాయుధంగా మార్చిన అసలైన దైవికబలం అని చెబుతారు.
భక్తుల నమ్మకం ప్రకారం, హనుమంతుడి తోకలో అగ్ని, వేగం, రక్షణశక్తి కలిసివుంటాయి; అందుకే అది గదకంటే విశేషంగా మహిమగలదని భావిస్తారు.
రామాయణంలో గద యుద్ధవీరత్వాన్ని సూచిస్తే, తోక ధైర్యం, అవమానజయం, దైవసంకల్పం, శత్రునాశనం అన్నింటినీ ఒకేసారి చూపించింది.
అందుకే హనుమంతుడి గద బలానికి ప్రతీక అయితే, ఆయన తోక దైవిక,విజయం, ఇది యుగయుగాలుగా భక్తి ప్రతాపానికి పరమచిహ్నంగా నిలిచింది.