మనకెప్పుడైనా బోర్ గా అనిపించినప్పుడు బ్రెయిన్ మనం చేసే పనిపై ఫోకస్ తగ్గించి, లోపల ఉన్న ఆలోచనలు, జ్ఞాపకాలు, ఊహల వైపుకి డైవర్ట్ అవ్వడం మొదలుపెడుతుంది.

ఇంట్రెస్ట్ లేకపోతే అది తక్కువగా రెస్పాండ్ అవుతుంది; అందుకే చిన్న పని కూడా భారంగా అనిపించి, కొత్త ఉత్సాహం కోసం మనసు వెతుకుతుంది.

ఈ సమయంలో మీ బ్రెయిన్ డీఫాల్ట్ మోడ్ లో వర్క్ చేస్తూ, మీరు చేయాల్సిన దానికంటే ఎక్కువగా మీ గురించి, మీ  గతం గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచింపజేస్తుంది.

బోర్ ఫీలింగ్ బ్రెయిన్ కి ఒక సంకేతం లాంటిది. ఇది తాను చేసే పనిలో కాన్సంట్రేషన్ తగ్గిసున్నాను అని చెప్పటం. 

సరిగ్గా ఫోకస్ చేయలేకపోతే, టైమ్ చాలా స్లోగా గడుస్తున్నట్లు అందిపిస్తుంది. అందుకే బోర్ ఫీలయినప్పుడు నిమిషాలు కూడా గంటల్లా అనిపిస్తాయి.

బోర్ కొట్టినప్పుడు మెదడు కొత్తదనం, ఆశ్చర్యం, చిన్న రివార్డ్స్ కోసం ఎక్కువగా చూస్తుంది; అందుకే పరధ్యానం, ఫోన్ స్క్రోలింగ్ ఎక్కువవుతుంది.

బోర్ డమ్ మరీ ఎక్కువగా ఉంటే కాన్సంట్రేషన్ తగ్గి, ఆవేశపూరిత నిర్ణయాలు పెరగవచ్చు; ఎందుకంటే బ్రెయిన్  వెంటనే స్టిమ్యులేట్ అయ్యి  నియంత్రణ కోల్పోతుంది.

అయితే ఈ బోర్ డమ్ అనేది టోటల్ బ్యాడ్ అని చెప్పలేం. ఎందుకంటే, అదే స్థితిలో క్రియేటివ్ థింకింగ్, సెల్ఫ్-రిఫ్లెక్షన్, కొత్త ఐడియాలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది.

కొన్ని సార్లు బోర్ అనిపించడం మానసిక అలసటకి సంకేతం కూడా కావచ్చు; అంటే మెదడు ఒకే సమాచారం వల్ల ఎక్కువగా అలసిపోయిందని అర్థం.

కాబట్టి బోర్ డమ్ వచ్చినప్పుడు బ్రెయిన్ ని బ్లేం చేయకండి; చిన్న బ్రేక్ ఇస్తే అది మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంది.