C/2026 A1 MAPS అనే తోకచుక్క ఏప్రిల్ 2026లో సూర్యునికి చాలా దగ్గరగా వెళ్తోంది, అందుకే ప్రపంచవ్యాప్తంగా స్కై వాచర్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ తోకచుక్క ఏప్రిల్ 4న సూర్యునికి అత్యంత దగ్గరగా చేరుతుంది; ఆ సమయం దీనికి చాలా ముఖ్యమైన, ప్రమాదకరమైన దశగా భావిస్తున్నారు.
ఇది సేఫ్ గా బయటపడితే, భారత్లో ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల నుంచి సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో కనిపించే అవకాశం ఉంటుంది
ఉత్తర భారతదేశంలో పొగమంచు, కాలుష్యం, నగర వెలుగులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ తోకచుక్కను చూడటం కాస్త కష్టంగా మారవచ్చు.
దీనిని చూడటానికి మంచి సమయం సూర్యాస్తమయం తర్వాత 30 నుంచి 45 నిమిషాల మధ్య, ఆకాశం పూర్తిగా చీకటి కాకముందే ఉంటుంది.
పడమర దిక్కు స్పష్టంగా కనిపించే సముద్రతీరాలు, పొలాలు, ఎత్తైన ప్రదేశాలు ఉత్తమం; భవనాలు ఎక్కువగా ఉన్న నగర ప్రాంతాల్లో ఇది కనిపించటం కష్టం.
కంటికి కనిపించకపోతే బైనాక్యులర్స్ ఉపయోగించవచ్చు, కానీ సూర్యుడి దగ్గర ఎప్పుడూ నేరుగా చూడకండి కంటికి ప్రమాదం.
ఈ తోకచుక్క విరిగిపోవచ్చు, లేక తోక మాత్రమే మిగలొచ్చు; అందుకే ఇది ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు.
ఏప్రిల్ 2 నుంచి 6 వరకు SOHO LASCO C3 ఆన్లైన్ ఇమేజెస్ లో దీన్ని ట్రాక్ చేయవచ్చు; పెరిహెలియన్ సమయంలో సూర్యునికి అత్యంత సమీపంలోకి వస్తుంది కాబట్టి కొద్దిసేపు కనిపించకపోవచ్చు.
స్పష్టమైన ఆకాశం, తక్కువ పొగమంచు, తక్కువ చంద్రకాంతి ఉన్న రోజున ఓపికగా చూస్తే, ఈ అరుదైన తోకచుక్కని చూసిన అనుభవం మరింత ప్రత్యేకంగా ఉంటుంది.