పరశురాముడు విష్ణువు దశావతారాలలో ఒకడు, బ్రాహ్మణుడిగా జన్మించిన యోధుడు, ధర్మాన్ని కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్న మహా వీరుడు.
ఆయన తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుక. గొప్ప తపశ్శక్తి, నియమాలతో జీవించిన పవిత్ర కుటుంబంలో పరశురాముడు పెరిగాడు.
క్షత్రియ రాజు కార్తవీర్య అర్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి కోరిన కోర్కెలు తీర్చే పవిత్ర గోమాత అయిన కామధేనువును బలవంతంగా తీసుకెళ్లాడు,
పరశురాముడు వెళ్లి ఆ రాజును సంహరించాడు. దీనికి ప్రతీకారంగా రాజు కుమారులు జమదగ్ని మహర్షిని క్రూరంగా హత్య చేశారు.
తండ్రి మరణంతో కోపంతో రగిలిన పరశురాముడు క్షత్రియ వంశంపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేసి యుద్ధానికి సిద్ధమవుతాడు.
ఒకతరం పోగానే ఇంకో తరం ఇలా పరశురాముడు మొత్తం ఇరవై ఒక సార్లు భూమిపై ఉన్న క్షత్రియులందరినీ సంహరించాడు.
ఇది కేవలం వ్యక్తిగత ప్రతీకారం మాత్రమే కాదు, అధర్మంగా మారిన పాలకులను శిక్షించేందుకు ధర్మ యుద్ధంగా భావించబడింది.
.
ఈ యుద్ధం తర్వాత పరశురాముడు తాను జయించిన భూమిని బ్రాహ్మణులకు దానం చేసి తాను తపస్సులో మునిగిపోయాడు, తర్వాత తన కోపాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాడు.
.
ఇతని కథ శక్తి, కోపం, ధర్మం మధ్య ఉన్న బ్యాలెన్స్ గురించి చెప్పే గొప్ప పాఠం, అతిగా ప్రతీకారం కూడా ప్రమాదకరమని మనకి తెలియచేస్తుంది.
.
ఈ సంఘటనలు పురాణాల్లో ధర్మం కాపాడటానికి జరిగినవిగా చెబుతారు, కానీ మనకు ఇవి ఎప్పటికీ శాంతి, నియంత్రణ ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయి.