కర్మ అంటే మనం చేసిన పనుల యొక్క ఫలితం.అంతేకానీ అది ప్రతీకారం కాదు, మన చర్యలకు సహజంగా వచ్చే స్పందన మాత్రమే.

మన ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ కర్మలో భాగం. ప్రతి చిన్న చర్య కూడా భవిష్యత్తులో మనపై ప్రభావం చూపుతుంది.

కర్మ ఎప్పుడూ వెంటనే ఫలితం ఇవ్వదు. కొన్ని సార్లు కొంత కాలం గడిచిన తర్వాత ఫలితం కనిపిస్తుంది, అదే నిజమైన కర్మ సిద్ధాంతం.

ప్రతీకారం అంటే కోపంతో చేసే పని. కానీ కర్మలో కోపం లేదు, అది కేవలం సహజమైన న్యాయం మాత్రమే మనకి  అందిస్తుంది.

మన జీవితంలో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చెడు పనులు చేస్తే తప్పకుండా చెడు ఫలితాలే  ఎదురవుతాయి.

కర్మను ఎవరూ తప్పించలేరు. మనం చేసిన ప్రతి పని మన జీవితంలో తిరిగి మన దగ్గరికే వస్తుంది అనేది అసలైన  సత్యం. 

మన ఉద్దేశం కూడా కర్మలో ముఖ్యం. చెడు  ఉద్దేశంతో చేసే పనులు చెడు ఫలితాలని ఇస్తే, మంచి ఉద్దేశంతో చేసిన పనులు ఎప్పటికీ మంచి ఫలితాలనే ఇస్తాయి. 

ఇతరులకు సహాయం చేయడం మంచి కర్మ. ఇది మన జీవితంలో సంతోషం, శాంతి తీసుకువస్తుంది నిజంగా మనల్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది.

కర్మ మనకు జీవిత పాఠాలు నేర్పుతుంది. తప్పులు చేస్తే వాటి ద్వారా నేర్చుకొని మంచి మార్గంలో ముందుకు వెళ్లడం అవసరం.

కర్మను అర్థం చేసుకున్నవారు ప్రతీకారం గురించి ఆలోచించరు. అలాంటివాళ్ళు ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.