స్పేస్ లో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మనిషి శరీరం వెంటనే స్పృహ కోల్పోతుంది. కేవలం కొన్ని సెకన్లలోనే శ్వాస ఆగిపోతుంది,
అక్కడ ఒత్తిడి లేకపోవడంతో బాడీ ఫ్లూయిడ్స్ మరిగే స్థితికి చేరుకుంటాయి, దీంతో చర్మం ఉబ్బిపోతుంది. కానీ బరస్ట్ అవ్వదు.
స్పేస్‌లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి. ఒక వైపు తీవ్ర చలితో గడ్డకట్టే ప్రమాదం, మరోవైపు సూర్యరశ్మితో శరీరం వేడెక్కే ప్రమాదం ఉంటుంది.
అంతరిక్షంలో హానికర కిరణాలు నేరుగా శరీరాన్ని తాకుతాయి, వీటి వల్ల DNA లాస్, సెల్ డిస్ట్రక్షన్, కేన్సర్ ప్రమాదం పెరుగుతుంది
స్పేస్‌లో సౌండ్ ట్రాన్స్ మిషన్ ఉండదు, అందువల్ల మనిషి పూర్తిగా నిశ్శబ్దంలో ఉంటాడు, ఇది మానసికంగా ఒత్తిడి, భయం, గందరగోళాన్ని కలిగిస్తుంది
గ్రావిటీ లేకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మారుతుంది, మెదడుకు రక్తం ఎక్కువగా చేరి తలనొప్పి, మతిభ్రమ, చూపులో మార్పులు కలుగుతాయి
స్పేస్‌లో నీరు లేకపోవడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది, దీనివల్ల శక్తి తగ్గడం, అవయవాల పనితీరు దెబ్బతినే పరిస్థితికి దారితీస్తుంది.
శరీరంలో ఉన్న వాయువులు విస్తరిస్తాయి, దీనివల్ల కడుపులో ఒత్తిడి పెరుగుతుంది, డిస్ కంఫర్ట్, పెయిన్, బాడీ ఇమ్బాలన్స్ ఏర్పడుతుంది.
స్పేస్‌లో కళ్ళు, చర్మం సూర్య కిరణాలకు నేరుగా గురవటంతో, చర్మంపై బొబ్బలు, చూపు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది.
స్పేస్‌లో రక్షణ లేకుండా మనిషి ఎక్కువసేపు జీవించలేడు, కేవలం కొన్ని నిమిషాల్లోనే శరీరం పూర్తిగా పనిచేయడం ఆగిపోయే పరిస్థితి వస్తుంది.