కొన్ని బర్త్ నంబర్లకి చిన్న వయసులో కష్టాలు ఎక్కువగా కనిపించినా, 35 ఏళ్ల తర్వాత జీవితం ఒక్కసారిగా మారడం మొదలవుతుంది.

బర్త్ డేట్ ని సింగిల్ డిజిట్ కి చేర్చి చూస్తే, బర్త్ నంబర్‌లో 4, 7, 8 సంఖ్యలు ఆలస్య విజయానికి సూచికలుగా భావించబడతాయి.

బర్త్ నంబర్ 4 ఉండే వారికి మొదట్లో అడ్డంకులు ఎక్కువైనా, 35 తర్వాత స్థిరమైన కెరీర్‌, పేరు, ఆర్థిక పురోగతి కనిపిస్తుందని అంటారు.

బర్త్ నంబర్ 7 ఉన్నవారు లోతుగా ఆలోచించే స్వభావం కలవారు. వీరికి నిజమైన గుర్తింపు, గౌరవం 35 తర్వాతే వస్తుంది.

బర్త్ నంబర్ 8 వారికి శని ప్రభావం ఉందని నమ్మకం. అందుకే కష్టం ఎక్కువైనా, 35 తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి.

ఇలాంటి సంఖ్యల వారికి తొందరగా రిజల్ట్ రాకపోవచ్చు. కానీ ఓపిక, క్రమశిక్షణ, అనుభవం కలిసి 35 ఏళ్ల తర్వాత పెద్ద విజయాన్ని తెస్తాయి.

35 ఏళ్ల తర్వాత వీరి నిర్ణయశక్తి పెరుగుతుంది. గత వైఫల్యాల నుంచీ నేర్చుకుని, సరైన దారిలో వేగంగా ముందుకు వెళ్లగలుగుతారు.

బిజినెస్‌, ఉద్యోగం, పెట్టుబడులు, వ్యక్తిగత గౌరవం వంటి రంగాల్లో ఆలస్యంగా వచ్చిన ఎదుగుదల ఎక్కువ కాలం నిలుస్తుందని వీరు నమ్ముతారు.

ఈ బర్త్ నంబర్లవారు జీవితంలో తొందరపడకుండా, తమ సమయం కోసం ఎదురుచూస్తే పెద్ద అవకాశాలు ఒక్కసారిగా వచ్చే అవకాశముంటుంది.

అయితే ఇవన్నీ న్యూమరాలజీ నమ్మకాల ఆధారమే. అసలు విజయాన్ని నిర్ణయించేది కష్టం, పట్టుదల, సరైన నిర్ణయాలు, సమయాన్ని ఉపయోగించుకోవడమే అని గుర్తుపెట్టుకోండి.