సహారా ఎడారిలో కనుగొన్న 7,000 ఏళ్ల నాటి పురాతన మానవ అస్థిపంజరాలు శాస్త్రవేత్తలకి షాకిస్తున్నాయి. ఎందుకంటే వాటి DNA ఇప్పటివరకు గుర్తించని వంశాన్ని సూచిస్తోంది.
ఇప్పటి ఎడారి ప్రాంతం ఒకప్పుడు పచ్చని నేలగా, సరస్సులు, జంతువులు, మానవులు జీవించిన ప్రాంతమని ఈ అవశేషాలు తెలియజేస్తున్నాయి.
పురావస్తు నిపుణులు ఈ అస్థిపంజరాలు సాధారణ సమాధులు కాదని, ప్రత్యేకంగా సంస్కార పద్ధతులతో ఖననం చేసిన మానవ సమూహానికి చెందినవని భావిస్తున్నారు.
DNA పరీక్షల్లో వీరి జన్యు లక్షణాలు ఆధునిక ఆఫ్రికన్, యూరోపియన్, మధ్యప్రాచ్య ప్రజలతో పూర్తిగా సరిపోలకపోవడం పెద్ద మిస్టరీగా మారింది.
ఇది సహారా ప్రాంతంలో ఒకప్పుడు పూర్తిగా వేరే మానవ వంశం లేదా ఇప్పటివరకు తెలియని సమాజం జీవించి ఉండవచ్చని నిరూపిస్తోంది.
వీరంతా ‘గ్రీన్ సహారా’ కాలంలో జీవించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, అప్పుడు ఎడారి బదులు సస్యశ్యామలమైన జీవావరణం ఉండేది.
ఈ అస్థిపంజరాల విశ్లేషణ ద్వారా వారి ఆహారం, జీవనశైలి, వేట పద్ధతులు, పరిసరాలతో ఉన్న సంబంధం గురించి కొత్త సమాచారం బయటపడుతోంది.
మరణించిన వారి శరీర నిర్మాణం, ఖననం విధానం చూస్తే, వీరు ఒక క్రమబద్ధమైన సంస్కృతి, కుటుంబ బంధాలు కలిగిన సమూహంగా కనిపిస్తున్నారు.
తెలియని DNA కనుగొనడం వల్ల మానవ వలసల చరిత్రపై ఉన్న పాత సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు మళ్లీ రీసర్చ్ చేయా ల్సిన పరిస్థితి వచ్చింది.
సహారా ఎడారి కింద ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉండవచ్చని ఈ డిస్కవరీ సూచిస్తోంది, ఇప్పుడిప్పుడే మానవ చరిత్రలో కొత్త అధ్యాయం తెరుచుకుంటోంది.