Anthropic ఎంత పవర్ ఫుల్ AI టూల్‌ అనేది ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది. అయితే, దానిని ఎందుకు రిలీజ్  చేయలేదో తెలుసుకోవాలని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోందిప్పుడు.

ఈ కొత్త AI సిస్టమ్ కొన్ని గంటల్లోనే కంప్యూటర్ సిస్టమ్‌లను హ్యాక్ చేయగల సామర్థ్యం ఉందని పరిశోధకులు గుర్తించారు.

ఈ AI ఆటోమేటిక్‌గా కోడ్ రాసి, సెక్యూరిటీ లోపాలను కనుగొని, వాటిని ఉపయోగించి దాడులకి పాల్పడుతుందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనుషుల సహాయం లేకుండా పూర్తిగా స్వతంత్రంగా పని చేసే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో సైబర్ సెక్యూరిటీకి పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది.

సిస్టమ్‌లను కేవలం గుర్తించడం కాదు, వాటిని దాటడానికి కొత్త మార్గాలను తక్షణమే సృష్టించడం ఈ AI ప్రత్యేకతగా చెప్పబడుతోంది.

ఈ టెక్నాలజీని తప్పుగా ఉపయోగిస్తే బ్యాంకింగ్, ప్రభుత్వ, వ్యక్తిగత డేటా అన్నీ ప్రమాదంలో పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

ఈ Anthropic AIని ఇప్పుడే రిలీజ్ చేస్తే మిస్ యూజ్ ఎక్కువగా జరుగుతుందని భావించి, ప్రస్తుతం నియంత్రణలపై దృష్టి పెడుతోంది.

ఇది ఎంత వేగంగా నేర్చుకుంటుందో చూస్తే, భవిష్యత్తులో మనుషుల కంటే ఎక్కువగా హ్యాకింగ్ చేయగలదనే భయం పెరుగుతోంది.

AI అభివృద్ధి వేగం కంటే సైబర్ సెక్యూరిటీ చర్యలు వెనుకబడి పోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంత శక్తివంతమైన AIని ప్రపంచానికి ఇవ్వడానికి ముందు సేఫ్టీ రూల్స్, కంట్రోల్స్ ఖచ్చితంగా ఉండాలని Anthropic భావిస్తోందిప్పుడు.

ఈ AI హ్యూమన్ హ్యాకర్ల కంటే ఫాస్ట్ గా వర్క్ చేసి, వేల సిస్టమ్‌లను ఒకేసారి టార్గెట్ చేయగల సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇది డీప్ లెర్నింగ్ ద్వారా కొత్త సెక్యూరిటీ లోపాలను స్వయంగా గుర్తించి, వాటిని ఉపయోగించడానికి తక్షణమే వ్యూహాలు రూపొందించగలదు.

ఇలాంటి పవర్ ఫుల్ టెక్నాలజీ దొంగల చేతుల్లో పడితే, సైబర్ దాడులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.

Anthropic AIని బాధ్యతాయుతంగా ఉపయోగించడానికి గట్టి గైడ్‌లైన్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. 

భవిష్యత్తులో AI టెక్నాలజీ అభివృద్ధి ఎంత వేగంగా పెరుగుతుందో, అదే స్థాయిలో భద్రతా చర్యలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.