NASA జూనో తీసిన జూపిటర్ కొత్త లుక్… సైంటిస్టులకే షాక్! 

ఇది నిజంగానే జూపిటరేనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు! 

జూపిటర్ గ్యాస్ జెయింట్ గ్రహం, ఇందులో గట్టి ఉపరితలం లేదు, గాలులతో కూడిన భారీ మేఘాలు నిరంతరం కదులుతూ ఉంటాయి 

జూనో పంపిన ఇమేజస్ లో జూపిటర్ మేఘాల్లో కలర్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి, ఇవి భూమిపై కనిపించని రేర్ నేచురల్ ల్యాండ్ స్కేప్స్ ని గుర్తు చేస్తాయి

ఈ ఇమేజస్ హై రిజల్యూషన్ టెక్నాలజీతో తీసినవి, అందులో చిన్న చిన్న తుఫానులు కూడా స్పష్టంగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి

జూపిటర్ మీద గాలి గంటకు వేల కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇది మన సోలార్ సిస్టమ్ లోనే మోస్ట్ పవర్ ఫుల్ వెదర్ కండిషన్ గా శాస్త్రవేత్తలు గుర్తించారు

గ్రేట్ రెడ్ స్పాట్ అనే భారీ తుఫాను జూపిటర్ మీద 300 సంవత్సరాలుగా ఆగకుండా కురుస్తుంది. ఇది భూమిపై కురిసే తుఫాన్లకంటే చాలా పెద్దది

జూనో మిషన్ ప్రధాన లక్ష్యం జూపిటర్ స్ట్రక్చర్, కోర్ భాగం మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ గురించి లోతైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం  

ఈ మిషన్ ద్వారా జూపిటర్ లోపలి కోర్ భాగం గురించి కొత్త విషయాలు తెలిసాయి, ఇందులో భారీ మెటల్ హైడ్రోజన్ పొరలు ఉన్నట్లు గుర్తించారు 

జూనో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి అందమైన రంగుల వింతలతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి

జూపిటర్ మేఘాల్లో కనిపించే వైట్, బ్లూ, రెడ్ కలర్స్  వాతావరణ రసాయనాల వల్ల ఏర్పడుతున్నాయి, ఇవి వేర్వేరు ఎత్తుల్లో ఏర్పడే ప్రక్రియలు చూపిస్తున్నాయి

జూనో స్పేస్ షిప్ జూపిటర్ చుట్టూ ఎల్లిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతూ, ప్రతి సారి దగ్గరగా వెళ్లి అమేజింగ్ ఫొటోస్ ని కలెక్ట్ చేస్తుంది  

ఈ మిషన్ డేటా సైంటిస్టులకి సౌరవ్యవస్థ ఆరంభం గురించి తెలుసుకోవడంలో సహాయపడుతోంది, జూపిటర్ పాత్ర ఎంత ముఖ్యమో వివరంగా అర్థమవుతోంది ఇప్పుడు

జూపిటర్ యొక్క స్ట్రాంగ్ మాగ్నెటిక్ ఫీల్డ్ స్పేస్ లో భారీ రేడియేషన్‌ను క్రియేట్ చేస్తుంది. ఇది జూనో వంటి మిష   న్లకి  కూడా సవాలుగా మారుతోంది

జూనో చిత్రాలు కేవలం శాస్త్రవేత్తలకే కాదు, సాధారణ ప్రజలకు కూడా విశ్వ సౌందర్యాన్ని దగ్గరగా చూపిస్తూ ఆసక్తిని పెంచుతున్నా

ఈ అద్భుత చిత్రాలు మనకు విశ్వం ఎంత విస్తారమైనదో గుర్తుచేస్తూ, మరిన్ని ఎక్స్ ప్లోరేషన్స్ కి ప్రేరణనిస్తాయి భవిష్యత్తు అంతరిక్ష యాత్రలకు మార్గదర్శకంగా నిలుస్తాయి