Claude ని ఉపయోగించే ముందు మీ టార్గెట్ క్లియర్‌గా ఉండాలి. సరైన గోల్ ఉంటే అవుట్‌పుట్ మరింత పర్ఫెక్ట్ గా వస్తుంది

షార్ట్ మ్యాటర్ కంటే పూర్తి వివరాలతో ప్రాంప్ట్ ఇవ్వండి. ఎక్కువ కాంటెక్స్ట్ ఇస్తే Claude మంచి అన్సర్స్  అందిస్తుంది

“Act as Expert” వంటి రోల్స్ ఇవ్వండి. ఉదాహరణకు మార్కెటింగ్, కోడింగ్ లేదా రైటర్ గా అడిగితే బెటర్ రిజల్ట్ ఉంటుంది

ఒకేసారి పెద్ద టాస్క్ ఇవ్వకుండా చిన్న స్టెప్స్‌గా డివైడ్ చేయండి. ఇలా చేస్తే Claude పర్ఫెక్ట్ గా పని పూర్తి చేస్తుంది.

మీకు కావాల్సిన అవుట్‌పుట్ ఫార్మాట్ ముందే చెప్పండి. ఉదాహరణకు లిస్ట్, టేబుల్ లేదా పాయింట్స్ రూపంలో అడగండి.

Claude ఇచ్చిన అన్సర్ ని వెంటనే ఉపయోగించకుండా ఎడిట్ చేయండి. చిన్న మార్పులు చేస్తే కంటెంట్ మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది.

““Explain like beginner” అని అడిగితే క్లిష్టమైన విషయాలు కూడా చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతుంది, ఉదాహరణలు మరియు స్టెప్ బై స్టెప్ వివరణలతో పూర్తిగా సహాయం చేస్తుంది.

బ్లాగ్, యూట్యూబ్, సోషల్ మీడియా కోసం వేర్వేరు టోన్‌లలో కంటెంట్ తయారు చేయమని అడగండి. ఫలితాలు ప్రత్యేకంగా ఉంటాయి.

Claude తో ఐడియాలు మాత్రమే కాదు, టైటిల్స్, హుక్స్, SEO కీవర్డ్స్ కూడా తయారు చేయించుకోవచ్చు. ఇది మన టైంని సేవ్ చేస్తుంది

Claude కి ఉదాహరణలు ఇస్తే అవుట్‌పుట్ క్వాలిటీ పెరుగుతుంది. మీరు కోరుకున్న స్టైల్‌ను అది త్వరగా అర్థం చేసుకుంటుంది

ఒకే ప్రశ్నను వేర్వేరు రీతుల్లో అడిగి బెస్ట్ అవుట్‌పుట్ ఎంచుకోండి. ప్రొఫెషనల్స్ ఇలా మంచి ఫలితాలు పొందుతారు

Claude ను కేవలం చాట్‌బాట్‌గా కాకుండా డిజిటల్ అసిస్టెంట్‌లా ఉపయోగించండి. ప్లానింగ్, రీసెర్చ్, కంటెంట్‌లో సహాయం పొందండి

లాంగ్ ఆర్టికల్స్ లేదా PDFs ను సమ్మరీ చేయమని అడగండి. ముఖ్యమైన విషయాలు వేగంగా తెలుసుకోవచ్చు. సమయం ఆదా అవుతుంది మరియు కీలక సమాచారం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. 

ప్రతి రోజు కొత్త ప్రాంప్ట్స్ ట్రై చేయండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే Claude ను 99% మంది కంటే మీరే బెటర్ గా ఉపయోగించగలుగుతారు.