Himalayan Mysteries, Unexplained Phenomena

Unexplained Himalayan Natural Phenomena

హిమాలయాలు చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, గంభీరంగా కూడా కనిపిస్తుంటాయి. కారణం, ఇక్కడ కేవలం  స్పిరిచ్వల్ ఎట్మాస్ఫియరే కాదు, మిస్టరీస్ కూడా దాగి ఉన్నాయని చెప్పేందుకే! హిమాలయ ప్రాంతంలో పర్యటన ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఊహించిన దానికంటే అద్భుతంగా అనిపిస్తుంది. మరోసారి భయానకంగా తోస్తుంది. ఎందుకంటే, దేవతల నివాసంగా భావించే ఈ ప్రాంతంలో మానవమాత్రులు ఎవ్వరూ చేరుకోలేని ప్రదేశాలు కూడా ఉన్నాయి. స్కెలెటెన్ లేక్, ఇన్విజిబుల్ సిటీ, హెవెన్ పాత్ వంటివెన్నో ఉన్నాయి. అలాగే ఇక్కడ స్నో-మ్యాన్, ఇమ్మోర్టల్స్ వంటివారెందరో ఉన్నారు. అలాంటి హిమాలయాల్లో ఆసక్తిని పెంచే కొన్ని మిస్టరీస్ దాగి ఉన్నాయి. ఆ మిస్టరీస్ ఏంటో… వాటి ప్రత్యేకత ఏంటో… మీరే చూడండి.

గురుడోంగ్మార్ నది

ప్రపంచంలోనే ఎత్తైన సరస్సులలో ​గురుడొంగ్మార్ సరస్సు ఒకటి. ఇది సముద్ర మట్టానికి 17,800 అడుగుల ఎత్తులో ఉంది. హిమానీనదాల నుండి మంచు కరిగినప్పుడు ఏర్పడిన నీటితో ఈ సరస్సు సృష్టించబడింది. తీత్సా నదికి మూలమైన ఈ  సరస్సు, కాంచన్‌జంగా పర్వత శ్రేణి పక్కన ఉన్న ఒక పీఠభూమిపై ఉంది. ఇంత ఎత్తులో సరస్సు ఉండటం వల్ల సంవత్సరంలో ఎక్కువ భాగం గడ్డకట్టుకుపోవటం సర్వ సాదారణం. కానీ, ఆశ్చర్యమేమిటంటే, ఇది ఒక్కరోజు కూడా గడ్డకట్టదు. ఇక్కడి ఉష్ణోగ్రతలు -20°C  నుండి 10°C వరకు ఉంటాయి. చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటికీ ఈ సరస్సే జీవనాధారాన్ని కల్పిస్తుంది. ఈ నీటిపై ఆధారపడి అక్కడి ప్రాంత ప్రజలు, మరియు వన్యప్రాణులు జీవిస్తున్నాయి. 

పురాణాల ప్రకారం, ఒకప్పుడు ఈ ప్రాంతమంతా బీటలుబారి ఉండేదట. ఇక్కడి సరస్సు ఏడాది పొడవునా గడ్డకట్టి ఉండేది. కానీ, ఇప్పుడు ఈ సరస్సును చూస్తే, వింటర్ సీజన్ లో కూడా గడ్డకట్టదు. దీని వెనక ఒక మిస్టరీ దాగి ఉంది. అదేంటంటే, ఫేమస్ బుద్ధిస్ట్ మాంక్ అయిన   ‘పద్మసంభవ’ టిబెట్ నుండి ఈ సరస్సు గుండా వెళుతున్నాడు. సుదీర్ఘకాలంనుండీ స్తంభించిపోయిన ఈ సరస్సును చూసి, మార్చివేయాలని అనుకుంటాడు. అందులో భాగంగానే, ఈ ప్రదేశాన్ని తాకి, స్థానికుల జీవితాలను సులభతరం చేస్తాడు. అప్పటి నుండి ఈ సరస్సు ఆ ప్రాంతంలోని స్థానికులకు తాగునీటికి ప్రధాన వనరుగా మారింది.

టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ

టైగర్స్ నెస్ట్ మోనాస్టరీ మోస్ట్ ఫేమస్ బుద్ధిష్ట్ మోనాస్టరీస్ లో ఒకటి. ఇది భూటాన్ లో ఉన్న పారో వ్యాలీ క్లిఫ్ పై ఉంది. టిబెట్‌ ప్రాంతంలో ఉన్న 13 టైగర్స్ నెస్ట్ కేవ్స్ లో ఇదీ ఒకటి. ఇక్కడ బౌద్ధ గురువైన ‘పద్మసంభవ’ మూడు సంవత్సరాల, మూడు నెలల, మూడు వారాల, మూడు రోజుల, మూడు గంటలపాటు ధ్యానం చేసినట్లు చెస్తారు. ఈ సమయంలో పద్మసంభవ బౌద్ధమతానికి చెందిన ‘వజ్రయాన’ విద్యని అభ్యసించటం,  మరియు బోధించటం వంటివి చేసేవారట. మొదట ఇక్కడ కేవలం టైగర్స్ కేవ్స్ మాత్రమే ఉండేవట. ఎప్పుడైతే, ఈ కేవ్స్ లో పద్మసంభవ ధ్యానం చేయటం జరిగిందో… అప్పటినుంచీ ఇక్కడ మోనాస్టరీ నిర్మించటం జరిగింది. ఈ మోనాస్టరీ 1692 లో నిర్మించబడింది.

9వ శతాబ్దానికి ముందు భూటాన్‌ టిబెట్‌లో భాగంగా ఉండేది. అప్పుడు గురు పద్మసంభవ… విద్యార్థులతో కలిసి ధ్యాన సాధన చేశారు. ఆ తర్వాత భూటాన్‌ టిబెట్‌ నుండీ విడిపోయింది. దీంతో, భూటాన్‌కి  వజ్రయాన బుద్ధిజాన్ని పరిచయం చేసిన ఘనత పద్మసంభవకే  దక్కింది. ఈ పుణ్యక్షేత్రం పద్మసంభవకే అంకితం చేయబడింది. అందుకే, బుద్ధిజం ఈ దేశానికి ఆరాధ్య దైవమైంది. అంతేకాదు, పద్మసంభవుని గౌరవార్ధం ప్రతీయేటా ఈ లోయలో ఫెస్టివల్ కూడా జరుపుకుంటారు. అయితే, ఇక్కడ మిస్టరీ ఏంటంటే, ఈ మోనాస్టరీ నిటారుగా ఉన్న ఒక కొండపై ఉంది. ఈ ప్రదేశాన్ని చేరుకోవటం మానవమాత్రులు ఎవ్వరికైనా కష్టం. అలాంటి ఈ ప్లేస్ కి గురు పద్మసంభవ టిబెట్ నుంచి టిగ్రెస్స్ పై శిఖరానికి గాల్లో ఎగురుకుంటూ వాచ్చారట. 

గంగ్ఖర్ పుయెన్సమ్

గంగ్ఖర్ పుయెన్సమ్ ప్రపంచంలో ఉన్న ఎత్తైన పర్వతాలలో ఒకటి. ఇది భూటాన్ లో ఉంది. దీని ఎత్తు 7,570 మీటర్లు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఈ పర్వతాన్ని ఎన్ని సార్లు కొలిచినా… దాని లెక్కలు ఎప్పుడూ ఒకదానితో ఒకటి ట్యాలీ అవటం లేదట. అంతేకాదు, ఇప్పటికీ ఈ పర్వతాన్ని పూర్తిగా ఎవరూ అధిరోహించలేకపోయారట. అందుకే, దీనిని ఓ రహస్య ప్రదేశంగా పిలుస్తారు. భూటానీస్ ఈ ప్రాంతం అత్యంత పవిత్రమైనదని, ఇక్కడ గాడ్స్, స్పిరిట్స్ వంటివారు తిరుగుతుంటారని నమ్ముతారు. ఇంకా ఇక్కడ అనేక వింత శబ్ధాలు, విచిత్ర కాంతులు, ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతున్నట్లు ఈ పర్వతానికి సమీపంలో నివసించే ప్రజలు చెబుతుండడం విశేషం. 

మొట్టమొదట ఈ మౌంటెన్ పీక్ ని 1922 లో రికార్డు చేశారు. అప్పటినుండీ, ఇప్పటివరకూ కొలిచిన కొలతలు ఏవీ మ్యాచ్ అవలేదు. ఇప్పటికీ ఈ పర్వతం యొక్క ఖచ్చితమైన ఎత్తు తెలియదు. ఇక మ్యాప్స్ ఆధారంగా ఈ పర్వతాన్ని కొలుద్దామని ట్రై చేశారు. కానీ, ఒక్కోసారి ఒక్కోచోట ఉన్నట్లు డిఫరెంట్ లొకేషన్స్ లో కనిపిస్తూ ఉండేది. అంతేకాదు, ఈ పర్వతం ఏ దేశంలో ఉందో కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. అందుకే, ఇది అన్-క్లయిమ్డ్ మౌంటెన్ గానే కాక, అన్-టచ్డ్ మౌంటెన్ గా కూడా రికార్డుకెక్కింది.

ఇది కూడా చదవండి: 37 ఏళ్ల తర్వాత కదులుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్… మానవాళికి తీరని ముప్పు!

నందా దేవి

నందా దేవి పర్వతం మన దేశంలోని 2వ ఎత్తైన పర్వతం. అలాగే, ప్రపంచంలో 23వ ఎత్తైన పర్వతం. అయితే, దశాబ్దాల తరబడి ఈ పర్వతం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కారణం అక్కడ జరిగిన అణు పరీక్షలే! 1964లో చైనా మొట్టమొదటిసారిగా  ఈ ప్రాంతంలో న్యూక్లియర్ టెస్టులు జరిపింది. ఈ విషయం అనేక అనుమానాలకి దారితీసింది. దీంతో, కోపం పెంచుకున్న అమెరికా చైనా ఆటోమిక్ ఫోర్స్ పై నిఘా పెట్టింది. కానీ, ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో భారత్‌ సాయం కోరింది. అందులో భాగంగానే, 1965లో యుఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇండియా ఇంటెలిజెన్స్ బ్యూరో కలిసి ఆపరేషన్ నిర్వహించాయి. దాని పేరే “ఆపరేషన్ హ్యాట్”. 

ఆపరేషన్ హ్యాట్ కోసం వీరు ఎంచుకున్న స్థలం నందాదేవి పర్వతం. ఈ ప్రక్రియ కోసం అవసరమైన ఎక్విప్‌మెంట్ మొత్తం ఈ మౌంటెన్ పైకి తీసుకెళ్ళారు. అందులో అణు ఇంధనంతో నడిచే జనరేటర్‌, ఫ్లూటోనియం క్యాప్సూల్, యాంటీనాలు ఉన్నాయి. తీరా వాళ్లు వెళ్లి ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాల్ చేసే టైమ్‌కి అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంకాసేపు అక్కడే ఉంటే ప్రాణాలు పోతాయన్న భయంతో వెంటనే అక్కడి నుంచి వచ్చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ ఆపరేషన్  స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ, మళ్లీ వెళ్లి చూస్తే… అక్కడ న్యూక్లియర్ మెటీరియల్ అయిన ఫ్లూటోనియం క్యాప్సూల్‌ లేదు. జనరేటర్ కూడా మిస్సయ్యింది. యాంటీనాలూ కూడా కనిపించలేదు.  వీటికోసం నందాదేవి పర్వతం మొత్తం 1966 – 67మధ్య కాలంలో వరకూ కూడా వెతికారు. అయినా, నో యూజ్. అప్పటినుంచీ ఇప్పటివరకూ నందా దేవి పర్వతం మిస్టీరియస్ ప్లేస్ గా మారింది.

బ్రోక్పా

బ్రోక్పా అనేది ఒక తెగ. వీరు స్వచ్చమైన ఆర్యన్ జాతికి చెందిన చివరి తెగ అని చెప్పుకుంటారు. పురాణాల్లో ఆర్యుల గురించి వినే ఉంటాం. వాళ్ళు ఆజానుబాహులని, మంచి అందగాళ్లని పేరుంది. అలాంటి జాతి ఇంకా భూమి మీద ఎక్కడైనా ఉందా అంటే… వాళ్ళే ఈ బ్రోక్పా ట్రైబ్స్. జమ్మూ కాశ్మీర్ లోని లడఖ్ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, పర్యత లోయలు, ప్రకృతి అందాలు మైమరపింపజేస్తాయి. ఈ పర్వతాల మద్యనుండీ ప్రవహించే  సింధునది తీరం వెంట నియంత్రణ రేఖ సమీపంలో ఓ 4 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లోనే ఈ బ్రోక్పా తెగ నివసిస్తుంది. వీరు సుమారు 2000 మంది వరకూ ఉంటారు. అయితే, వీరంతా ది గ్రేట్ అలెగ్జాండర్ యొక్క వారసులమని చెప్తారు. చూడటానికి వీరంతా 6 ఫీట్స్ హైట్ ఉండి… చెంఘిజ్ ఖాన్ లాంటి సెక్సువల్ ఎబిలిటీ కలిగి ఉంటారని అంటుంటారు. 

ఈ తెగకి ఒక వింత ఆచారం ఉంది. అదేంటంటే, వీరు ప్రపంచవ్యాప్తంగా తమ స్పెర్మ్ ని డొనేట్ చేస్తారు. యూరప్ లో హిట్లర్ కాలం నుంచి ఆర్యజాతి మానవజాతిలోనే స్వచ్ఛమైన జాతి అని ముద్ర పడిపోయింది. భూమిపై ఉన్న ప్రజలందరిలోకెల్లా  ఆర్యన్లలోనే అత్యంత స్వచ్ఛమైన రక్తం ప్రవహిస్తుంటుందని జర్మన్ నాజీలు నమ్ముతారు. అందుకే, ఈ ట్రైబల్ మగవారితో గడిపి… ఆర్యజాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలని విదేశీ అమ్మాయిలు ఉవ్విళ్ళూరుతుంటారు. ఈ కారణంగానే  ఫారిన్ గర్ల్స్ ఇక్కడికి వచ్చి అమ్మలుగా మారుతున్నారు. దీంతో ప్రతీయేటా విదేశాలనుంచీ ఇక్కడికి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల ఇది ప్రెగ్నెన్సీ టూరిజంగా మారింది. అదికాస్తా ఇప్పుడు పెయిడ్ ప్రెగ్నెన్సీ టూరింజంగా మారింది. కానీ, ఇదంతా చాలా సీక్రెట్ గా జరుగుతుంది. 

ఓం పర్వతం

పవిత్ర హిమాలయాల్లో ఓం ఆకారంలో ఉండే పర్వతమే ఓం పర్వతం. ఇది ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతమైన ఉత్తరాఖండ్ లో ఉంది. ఓం పర్వతాన్ని ఓంకార పర్వతం, చిన్న కైలాస్, ఆది కైలాస్, బాబా కైలాస్, మరియు జోంగ్లీంగ్‌కొంగ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ పర్వతంపై ఉన్న గొప్ప మిస్టరీ ఏంటంటే, పర్వతంపై కనిపించే ‘ఓం’ అనే అక్షరం. పర్వతం మొత్తం బ్లాక్ స్టోన్ తో ఏర్పడి… కేవలం దానిపై భాగాన పేరుకున్న మంచు ఓంకార రూపాన్ని సంతరించుకోవడమే! హిందూ ధర్మంలో ఓంకారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే, ఇది బలమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రతిధ్వనిస్తుంది. అందుకే, ఈ పర్వతప్రాంతంలో ఉన్న భూమి మొత్తం ఓంకారం యొక్క వైబ్రేషన్స్ కలిగి ఉంటుంది. 

కైలాస పర్వత శ్రేణులలో ఉన్న ఈ ఓం పర్వతాన్ని ఈశ్వరుని ప్రతి రూపంగా భావిస్తుంటారు. ఈ పర్వత ముఖ భాగం  భారత్ వైపు, వెనుక భాగం నేపాల్ వైపు ఉంటాయి. ఇది ఇండో-నేపాల్ సరిహద్దులలో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. అందుకే పర్వతం దగ్గరకి  వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ రెండు దేశాల అనుమతి తీసుకోవలసి ఉంటుంది.. ఇంకా ఈ పర్వతానికి ముందు భాగంలో పార్వతీ సరస్సు, జోంగ్లింగ్‌కాంగ్ సరస్సులు ఉంటాయి.. జోంగ్లింగ్‌కాంగ్ సరస్సుని మానససరోవర సరస్సుకు ప్రతిరూపంగా భావిస్తుంటారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top