డాల్ఫిన్

డాల్ఫిన్లు గుంపులుగా బయలుదేరి సముద్రంలో చేపలను చుట్టుముట్టి, వేటాడతాయి. అవి సౌండ్ వేవ్స్‌ ద్వారా లొకేషన్‌ను గుర్తించగలవు.

షార్క్  

షార్క్‌లు స్మెల్ ద్వారా వేటను గుర్తించి, వేగంగా చుట్టుముట్టి వేటాడతాయి. వేట కోసం వాటి దంతాలు ఉక్కు కత్తుల్లా ఉంటాయి.

మెంటా రే  

విశాలమైన రెక్కలతో మెంటా రేలు నీటిలో మృదువుగా కదిలి, చిన్న జీవులను వడబోతలా నోట్లోకి పీల్చుకుంటాయి.

పెంగ్విన్

పెంగ్విన్లు నీటిలో స్విమ్ చేయటంలో నిపుణులు. అవి గుంపులుగా కలిసి చిన్న చేపల్ని వేగంగా పట్టి తినేస్తాయి.

మోరే ఈల్  

ఈ సర్పాకార చేప చిన్న గుట్టల్లో దాగి, ఎర కనబడగానే అకస్మాత్తుగా దాడిచేస్తుంది. వేగవంతమైన దాడులు దీని ప్రత్యేకత. 

ఫ్రాగ్ ఫిష్

ఇవి వేటాడే జంతువుని మభ్యపెట్టడం కోసం అనేక రకాల వేషధారణతో మిమిక్రీ చేసి వేటను ఆకర్షిస్తాయి. ఆపై మెరుపు వేగంతో సాగుతూ ఎరపై దాడిచేస్తాయి.

కటిల్ ఫిష్  

ఇది రంగు మారుస్తూ చేపలని మోసం చేస్తుంది. దగ్గరకి రాగానే వాటిపై జెట్ స్పీడ్ తో దాడిచేస్తుంది.

సీ ఓటర్

సీ ఓటర్లు నీటిలో తేలుతూ షెల్‌లను పగలగొట్టి వాటిలోని ఆహారాన్ని తింటాయి. ఆహారాన్ని వేటాడటం కోసం సముద్ర అడుగు భాగానికి వెళతాయి.

స్పియర్ ఫిష్  

స్పియర్ ఫిష్ నీటిలో అతి వేగంగా ఈదుతుంది. దీని ఈటె లాంటి పొడవైన, పదునైన ముక్కుతో వేటపై దూకుతూ గాయపరచి, వెంటనే పట్టుకొని మింగేస్తుంది. 

అక్టోపస్

అక్టోపస్ శత్రువును దాచిన కళ్లతో చూస్తూ నెమ్మదిగా దగ్గరవుతుంది. తన కాళ్లతో చుట్టేసి వేటను పట్టుకుంటుంది.