మోన్రియేల్ క్యాథడ్రల్ – సీసిలీ

1174లో కట్టబడి జరిగిన ఈ చర్చిలో బంగారు రంగు గోడలపై బైబిల్ చిత్రాలు ఉన్నాయి. పాతకాలపు ఈ అద్భుతమైన  కళను చూసేందుకు రెండు కళ్ళూ చాలవు.

నోట్రె డామ్ – ఫ్రాన్స్ 

ఈ చర్చిని 850 ఏళ్ల క్రితం కట్టారు. పారిస్ నడిబొడ్డున ఉన్న  ఈ అద్భుత నిర్మాణం కళాత్మక స్ఫూర్తికి ఒక ఉదాహరణ.

సెయింట్ బాసిల్ చర్చి – రష్యా 

రంగురంగుల గోపురాలు కలిగిన ఈ చర్చి మాస్కో నగరంలో ఉంది. 1561లో కట్టిన ఈ చర్చి పాత చారిత్రక నిర్మాణం. 

చార్ట్‌ర్స్ క్యాథడ్రల్ – ఫ్రాన్స్ 

1194లో నిర్మితమైన ఈ చర్చిలో రంగు గాజుల కళ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, ఇది యునెస్కో వారసత్వ ప్రదేశం కూడా.

సెయింట్ పీటర్స్ బసిలికా – వాటికన్ 

ఈ చర్చి ప్రపంచంలోనే అతి పెద్దది మైకెలాంజెలో వేసిన గొప్ప గోపురం దీని ప్రత్యేకత.

వెస్ట్‌మినిస్టర్ అబ్బే – లండన్

ఇది 960లో నిర్మించబడింది. ఇక్కడే బ్రిటన్ రాజు, రాణుల పట్టాభిషేకాలు కూడా జరగడం ప్రత్యేకత. 

కోలొన్ క్యాథడ్రల్ – జర్మనీ

1248లో నిర్మాణం ప్రారంభమైన ఈ చర్చి చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది గోతిక్ శైలికి ఉదాహరణ.

హాగియా సోఫియా – టర్కీ

ముందు చర్చి, తరువాత మసీదు, ఇప్పుడు మ్యూజియంగా ఉన్న ఈ భవనం ప్రపంచంలోనే చాలా గొప్ప నిర్మాణం. 

మిలాన్ క్యాథడ్రల్ – ఇటలీ

600 సంవత్సరాలపాటు కట్టిన ఈ చర్చిలో 135 శిఖరాలు ఉన్నాయి. చూడటానికి ఇది ఎంతో అందంగా ఉంటుంది.

లాస్ లాజాస్ – కొలంబియా 

ఇది లోయలో ఉన్న చర్చి. బ్రిడ్జ్ మాదిరిగా కనిపించే ఈ నిర్మాణం ప్రకృతి మధ్యలో అందంగా ఉంది.