శనివారం రోజున ఇల్లు ఊడ్చి చెత్త బయటకు పారేయడం చేయకూడదు అంటారు, దాంతో ఫైనాన్షియల్ స్టెబులిటీ తగ్గుతుందని నమ్ముతారు.

ఈ రోజు కొత్త వస్త్రాలు కొనడం లేదా ధరించడం మానుకోవాలి అంటారు, అదృష్టం ఆలస్యంగా వస్తుందని విశ్వాసం ఉంది.

శనివారం రోజున నూనె లేదా ఇనుము వస్తువులు ఉచితంగా ఇవ్వడం చేయకూడదు, అలాచేస్తే శని ప్రభావం పెరుగుతుందని చెబుతారు. 

అప్పు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం శనివారం రోజు చేయకూడదు అంటారు, అలాచేస్తే లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ కొనసాగుతాయని నమ్మకం ఉంది. 

ఈ రోజున పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. అంటారు, అలాచేస్తే పనులు ఆలస్యమవుతాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. 

శనివారం రోజున పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు, కుటుంబ శాంతి దెబ్బతింటుందని పెద్దలు చెప్తుంటారు. 

శనివారం రోజున ఆలస్యంగా లేవడం మరియు అలసత్వంగా గడపడం మానుకోవాలి, అలా చేస్తే శని కృప దూరమవుతుందని అంటారు.